మేతగాళ్ల వల్ల సామాన్యుడికి నష్టం

3975

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సరి అయిన వసతులు ఉండవు. ఎక్కడ చూసినా కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయిస్తారు కానీ ఒక్కటీ పనిచేయదు. ఇది మన రైల్వే దుస్థితి. కాంట్రాక్టర్లకు ప్రోజెక్టులు ఇస్తే వాటిల్లో క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ముడుపుడు కట్టాలి. లెకుంటే ఇంకో పనిలో కాంట్రాక్ట్ రాదు. రైల్వేలో కొన్ని వేల టెండర్లు ఉంటాయి.

అన్ని కూడా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే ‘రాజు గారు వచ్చారు. మళ్ళీ హరి కధ మొదలు పెట్టండి’ అన్నట్టు చేసిన వర్క్‌ని మళ్ళీ కొత్త ఇంజినీర్ వచ్చి పైన సిమెంట్ పామి కోట్లు అవినీతి చేస్తున్నారు.
ఫ్లాట్ ఫారం బాత్ రూమ్‌లకు పాట పెట్టి నిర్ణిత రేట్లకు నడపాలి అని చెప్తారు. అలాగే వాడు బోర్డ్ పెట్టి ఒకటికి 2 రెండుకు 5 అని పెడతాడు కానీ వసూలు చేసేది 5, 10 రూపాయలు బోర్డ్ ఈరోజు రేట్లు పెరిగాయి. మార్చ లేదు అంటాడు. దేశంలోని ఏ రైల్వే స్టేషన్లో అయినా రోజూ ఇదే బాగోతం.

ఇవన్నీ అధికారులకు తెలిసినా జేబు కోత ఎందుకు? అని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఫ్లాట్ ఫారం మీద అమ్మే వాళ్ళ దగ్గర లంచాలు గుంజి గుట్కాలు అమ్మించడం. టికెట్ లేకుంటే బుక్ రాయకుండా టీసీలు వందో రెండొందలు గుంజడం బుక్ రాస్తే 500 రాయాలి, నేను కాబట్టి 200 అంటాడు ఇలా కోట్లలో రైల్వే సంపదను కాజేస్తున్న టీసీలు. ఫ్లాట్ ఫార్మ్ మీద ఒక్క ఎలక్ట్రిక్ బోర్డ్‌లు ఫ్లగ్‌లు పని చేయవు. కోట్ల కుంభకోణం ఇవి టెండర్లలో. రైల్వే క్లినింగ్, పెయింట్, తినుబండారాలు అమ్మకాలు, యాడ్స్, ఇలా కొన్ని వేల టెండర్లు ఒక్క పని సరిగా అవ్వదు. కోట్లు ఖర్చు పెడతారు.

జనరల్ భోగిలో బాత్ రూమ్ క్లినింగ్ చూడాలి. నరకంలో కూడా ఇలాంటి శిక్షలు ఉండవు అన్నట్టు వాసన. ఒక్కోసారి నీళ్లు ఉండవు. ఫాన్స్, లైట్లు పనిచేయవు. కానీ టిక్కెట్లు రేట్లు టంచనుగా పెంచుతారు. ఫ్లాట్ ఫార్మ్ మీద ఒక్క గంట కూర్చోగానే ఏనుగులా ఉన్నవాడు పీనుగులా అవుతాడు. తేనె పుట్టలుగా దోమలు, ఒక్క ఫ్యాన్ పని చేయదు. వర్షం వస్తే అంతే సంగతులు. ఫ్లాట్ ఫార్మ్ క్లినింగ్ ఉండదు.

వాటర్ మినరల్ అంటారు. అవి తాగితే యమపురికి ద్వారాలు తీసినట్టే. క్లినింగ్ ఉండదు, ఏమిటిరా బాబూ ఈ కర్మ అనిపిస్తుంది. రైల్లలో కోట్లు కొద్దీ స్మగ్లింగ్ వస్తువులు వెళ్తూనే ఉంటాయి. అన్ని తెలిసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ వచ్చిన కాడికి రాబట్టు కుంటున్నారు. రైళ్లలో హిజ్రాలు ఆగడాలు ఎక్కువ, పొట్ట కూటి కోసం పదో పరకో కాకుండా వందల్లో వసూళ్లు ఖాకీల మమ్ముళ్ళు షరా మాములే.

అందుకే వేల కోట్లు ఆదాయం వస్తున్న అధికారులు దగ్గర నుంచి మినిస్టర్ లెవెల్ వరకూ మూటలు కట్టి ఐస్ చేతులు మారి కరిగినట్టు పనికి 100లో 10 రూపాయలు కూడా వాడడం లేదు. అందుకే కోటిపల్లి కాలం కొన్ని సూచనలు. టిసీల పుస్తక లెక్కలు పక్కన పెట్టి సాఫ్ట్వేర్ మిషన్ ద్వారా మాత్రమే పెనాల్టీ కట్టించుకోవాలి. ఒక వేల డబ్బులు లేకుంటే మిషన్ ఆధార్‌కి అనుసంధానం చేసి ఇంటికే నేరుగా రుసుం పత్రం పంపాలి. లేకుంటే ఆధార్‌కు అనుసంధానం ఉన్న మొబైల్ బ్యాంక్ అకౌంట్లు నిలిపి వేయాలి.

ఇలా చేస్తే టీసీల అవినీతిని అరికట్టవచ్చు. కానీ, ఎందుకో గానీ, అధికారులు ఇలాంటివి చేయరు. రైల్వే కాంట్రాక్ట్‌లు అన్ని ఆన్లైన్ టెండర్‌లు ద్వారా మాత్రమే పిలవాలి. చేసిన పనికి కనీసం 5 ఏళ్ళు గ్యారంటీ ఉండేలా చూడాలి. దీని కోసం క్వాలిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేసి పనులు పర్య వేక్షించాలి. పనుల్లో నాసిరకం సామగ్రి వాడితే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. రైల్వేలో ఫారం పైనా నిర్ణయయించిన రేట్లు మాత్రమే మల, మూత్రాలుకు వసూలు చేయాలి. లేకుంటే ప్రయాణికులు అంతే చెల్లించేలా ప్లాట్ ఫార్మ్‌పైన బోర్డ్‌లు పెట్టి ప్రయాణికుల్ని ఎలెర్ట్ చేయాలి. తిను బండరాల ధరల నియంత్రణ పాటించాలి.

ఎక్కువ వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ధరలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మ కూడదు.
ఇంజినీర్. పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడితే కొత్త చట్టం చేసి శిక్షలు వేసేలా చేయాలి. రిజర్వేషన్, జనరల్ భోగిలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగలు, హిజ్రాల మాఫియాల ఆగడాలు నియంత్రించాలి. మనకు ఎందుకు అని టిక్కెట్ పడేస్తే 100, రెండోదలు కట్టి అవినీతిని పెంచకండి.

అన్నిటికి రుసుం రసీదు పొందండి. బోర్డ్‌లో పెట్టిన ధరలు టాయిలెట్‌లలో చెల్లించండి రైల్వే అభివృద్ధికి తొడ్పడండి. టికెట్ టికెట్ పెరుగుదలను నియంత్రణకు పాల్పడి పేదల డబ్బుకు భరోసా ఇవ్వండి.
మన రైల్వే మనకోసం అని ప్రతి ప్రయాణీకుడూ భావించాల్సిన అవసరం ఉంది. అవినీతిని తెలిస్తే బయట పెట్టండి. టికెట్ పెరిగితే మనడబ్బే అంతా పోతుంది.