ఏపీలో మద్య విముక్తి కేంద్రాలు

6
43 వీక్షకులు

ప్రకాశం జిల్లాలో తొలి కేంద్రాన్ని ప్రారంభించిన బాలినేని

ఒంగోలు, మే 27 (న్యూస్‌టైమ్): పేద, బడుగుల జీవితాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో మద్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిస్తుందని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. నాలుగవ సంవత్సరం పాలన మొదలు కాగానే మద్య నిషేధం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మద్యానికి బానిసలై మానసిక స్థితి దెబ్బతిన్నవారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పరచటానికి వ్యసన విముక్తి కేంద్రాన్ని (డిఎడిక్షన్ సెంటర్) ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన వ్యసన విముక్తి కేంద్రాన్ని (డిఎడిక్షన్ సెంటర్) మంత్రి బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మద్యం విక్రయాలను నియంత్రిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పాలన ప్రారంభమైన నాటి నుంచి రానున్న మూడేళ్లలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తుచేశారు. మద్యానికి బానిసలైన వారికోసం ముందుచూపుతో 13 జిల్లాల్లో వ్యసన విముక్తి కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. కోవిడ్- 19 నియంత్రణలో జిల్లాలోని వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్నారు.

జిల్లా కలెక్టర్ సూచనతో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం ద్వారానే కరోనా వైరస్ సోకిన కేసులు శూన్యం అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా ఒకటి, రెండు కేసులు కొత్తగా వచ్చాయని ఆయన వివరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలు పరిష్కరించి, అన్ని విధాల అభివృద్ధి చేయడానికి వైద్యశాఖ మంత్రి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒంగోలుకు వచ్చేలా చూస్తామన్నారు. ముందుగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేయునున్న కార్డియాలజీ విభాగం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు.

మద్యానికి బానిసలైన వారిని ఆదుకోవడానికి వ్యసన విముక్తి కేంద్రాన్ని ఒంగోలు నగరానికి మంజూరు చేయడం సంతోషదాయకమని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. మానసికంగా దెబ్బతిన్న వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంచి వైద్యం అందించటానికి ప్రభుత్వం రూ. 37.27 లక్షల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. 15 పడకలతో వ్యసన విముక్తి కేంద్రం మొద లైందని, పారా మెడికల్ సిబ్బందిని త్వరలో నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. కేంద్రాన్ని సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా మద్య నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిండెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపరిండెంట్ మురళికృష్ణా రెడ్డి, వైద్య కళాశాల ప్రధానాచార్యులు రాజమన్నార్, ఆర్.ఎమ్.ఓ. వేణుగోపాల రెడ్డి, వైద్య శాఖ ఇంజినీర్ రవి, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

6 COMMENTS

  1. [url=https://azithromycin.us.org/]buy azithromycin[/url] [url=https://attarax.com/]buy atarax[/url] [url=https://hydroxychlorothiazide.com/]hydrochlorothiazide medication[/url] [url=https://duloxetine.us.com/]drug cymbalta[/url] [url=https://motrin.us.com/]motrin 1800 mg[/url] [url=https://hydroxychloroquine.us.com/]hydroxychloroquine 90 mg[/url] [url=https://trazodonesale.com/]trazodone hcl 50 mg[/url] [url=https://malegra.us.org/]buy malegra[/url] [url=https://prednisolone.us.org/]prednisolone 15 mg[/url] [url=https://ivermectin.us.org/]stromectol generic[/url]

  2. [url=http://malegra.us.org/]malegra dxt tablets[/url] [url=http://retina.us.org/]retin-a generic[/url] [url=http://flomax.us.com/]flomax rx[/url] [url=http://proscar.us.com/]buy proscar[/url] [url=http://nexium.us.org/]2018 nexium coupon[/url] [url=http://tamoxifenpct.com/]buy tamoxifen[/url] [url=http://ivermectin.us.org/]ivermectin buy online[/url] [url=http://wellbutrin.us.org/]wellbutrin xl 150[/url] [url=http://cialisprice.us.org/]cialis prices[/url] [url=http://singulair.us.com/]singulair 10 mg[/url] [url=http://cephalexin365.com/]cephalexin buy canada[/url] [url=http://prazosin.us.com/]prazosin 1mg[/url] [url=http://hydroxychlorothiazide.com/]buy hydrochlorothiazide[/url] [url=http://trazodonesale.com/]trazodone tablets[/url] [url=http://amitriptyline24.com/]amitriptyline hcl 10mg[/url] [url=http://motrin.us.com/]motrin 200 mg[/url] [url=http://azithromycin.us.org/]azithromycin 500 tablet[/url] [url=http://hydroxychloroquinecv.com/]buy hydroxychloroquine[/url] [url=http://metformin.us.org/]metformin 1000 mg price in india[/url] [url=http://hydroxychloroquine.us.com/]plaquenil buy[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here