రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

71

శ్రీకాకుళం, మే 11 (న్యూస్‌టైమ్): జిల్లా పరిధి రణస్థలం మండలం కోస్ఠు గ్రామ సమీపంలోని హరే రామ హరే కృష్ణ గుడి దగ్గర కంబాలపేట జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యా, భర్త ప్రాణాలు కోల్పోయారు. లారీని కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ఓ బాలిక అనాధగా మారింది. ఈ ప్రమాదంలో భార్య భర్త అక్కడికక్కడే మరణించగా పాప అనాధ అయింది. వీరిది పలాస. విశాఖపట్నం నుండి పలాస వెళుతుండగా ప్రమాదానికి గురైంది. డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగా యాక్సిడెంట్ జరిగింది.