జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి పనులు

0
7 వీక్షకులు
ఖమ్మం నగరంలో ప్రారంభమైన పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించినప్పటి దృశ్యం

ఖమ్మం, ఏప్రిల్ 14 (న్యూస్‌టైమ్): నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన అనేక అభివృద్ధి పనులు జీహెచ్ఎంసీ తరహాలోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరైన పనులకు కరోనా వైరస్ నేపథ్యంలో కూలీల కొరతతో పనులు ఆగిపోయాయి. అయితే వేసవిలొనే పనులు పూర్తి చేయకపోతే వచ్చే వర్షాకాలంలో పనులు చేయడం సాధ్యపడదని భావించిన మంత్రి పువ్వాడ అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో బీటీ రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించాలని కార్పొరేషన్, ఆర్&బి అధికారులను ఆదేశించారు.

సుభాష్ చంద్రబోస్ బొమ్మ సెంటర్, చర్చ్ కాంపౌండ్ సెంటర్, దంసలాపురం ఆర్ఓబి బ్రిడ్జి అనుసంధానం బీటీ రోడ్, ముస్తఫా నగర్ సెంటర్‌లో ప్రారంభమైన పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. గ్రేటర్ హైద్రాబాద్ తరహాలో ఇక్కడ కూడా పనులు పూర్తి చేసుకోవాలన్నారు. వేసవిలో నిర్దేశించిన పనులన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ అధికారి రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here