విజయవాడ, సెప్టెంబర్ 15 (న్యూస్‌టైమ్): అంతర్వేది ఘటన మరువక ముందే చోటు చేసుకున్న మరో పెద్ద సంఘటన. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ దేవస్థానంలో మహా మండపం వద్ద అమ్మవారి రధానికి ఉన్న నాలుగు సింహాలలో మూడు సింహాలు చోరీకి గురయ్యాయి. అవి చోరీకి గురయ్యాయని సంగతి బాహ్య ప్రపంచానికి తెలియకుండా కొత్త వెండి సింహాలు తయారీ పనిలో దేవస్థానం సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి తలమునకలై ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే ఒక విపత్తుకి ఇది సూచనగా పేర్కొన్న ప్రతిపక్ష తెలుగుదేశం ఈ ఘోర అపచారాన్ని భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.