విపత్తు నిర్వహణ నిపుణులు అవసరం

0
9 వీక్షకులు
రక్షణ ఉద్యోగులకు సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్న ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌
  • ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): విపత్తులు సంభవించిన ప్రత్యేక సందర్భాలలో నిపుణులైన సిబ్బంది సహకారంతో నష్టాన్ని నివారించడం సాధ్యపడుతుందని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం మెట్రాలజీ, ఓషనోగ్రఫీ విభాగంలో రక్షణ రంగ ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఫైర్‌ సేఫ్టీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగాల ఉద్యోగులకు అవసరమైన కోర్సులను కాలానుగుణంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.వినోద రావు, విభాగాధిపతి డాక్టర్‌ సునీత, ఉజ్వల్‌ కుమార్‌ ఘటక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫీకేట్లను రిజిస్ట్రార్‌ ప్రధానం చేశారు.