‘దామా’ దాతృత్వం

0
9 వీక్షకులు
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దామా సుబ్బారావు

విశాఖపట్నం, మే 13 (న్యూస్‌టైమ్): కరోనా విపత్తు, లాక్‌డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామా సుబ్బారావు చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. జీవీఎంసీ 86వ డివిజన్ నుంచి అధికార పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధిగా బరిలో ఉన్న దామా సుబ్బారావు కరోనా విపత్తు కష్టాలు ప్రారంభమైనప్పటి నుంచీ డివిజన్‌లోని పేద కుటుంబాలకు తానున్నానన్న ధీమా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బుధవారం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దువ్వాడ సెక్టర్-2లోని సుమారు 500 మందికి పేదలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాగిరెడ్డి మాట్లాడుతూ దామా దాతృత్వం చాలా మందికి ఆదర్శప్రాయమన్నారు.

కష్ట కాలంలో ఆపన్నులను ఆదుకోవాలన్న ఆశయంతో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ఇతర నాయకులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహమ్మారి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తూ భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దామా సుబ్బారావు, వైసీపీ శ్రేణులు బాబు, రాజ్‌కుమార్ ఆచార్య, చెగొండి శ్రీనివాస్, మాటూరి శ్రీనివాస్, గుండాసు రాజు, బార్ సాయి, భూపతిరాజు శ్రీనివాస్ రాజు, పప్పు, జీవన్, మండవ మోహన్, చిట్టి దేముడు, ప్రసాద్, మురళి మోహన్, హరీష్ వర్మ, అనీష్ తదితరులు పాల్గున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here