తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీ

0
8 వీక్షకులు

తిరుపతి, మే 27 (న్యూస్‌టైమ్): నిరుపేదలకు, నిరాశ్రయులకు హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో విజిటేబుల్ రైస్ తయారుచేసి 150 మంది నిరుపేదలకు, నిరాశ్రయులకు పంచడం జరిగిందని హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు కల్లుపల్లి సురేందర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ఆకలితో అలమటించే నిరాశ్రయులకు ఆహారాన్ని తయారుచేసి అందిస్తున్నామన్నారు. తమ మిత్ర బృందం సహాయంతో హెల్పింగ్ హార్ట్స్ ద్వారా కొంతమందికైన ఆకలితీర్చడం తృప్తిగా వుందన్నారు. ప్రతిరోజు ఆహారాన్ని తయారు చేయించి తమ ఇందిరానగర్ ప్రాంతంలో కొంతమంది నిరుపేదలకు, అదేవిధంగ ఎస్వీ యూనివర్శిటీ రోడ్, ప్రకాశంరోడ్, స్విమ్స్ పరిసరాల్లోని యాచకులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయర్, మల్లెపూల ప్రేమ్ కుమార్, యెన్నికపాటి రామకృష్ణ, త్యాగరాజ్, గ్యాస్ లీలాప్రకాష్, కీర్తి వెంకటేశ్వర్లు సహాయ సహకారాలు అందించారు.

హెల్పింగ్ హార్ట్స్ నిత్య అన్నదాన వితరణకి బుధవారం తన స్కూల్ మిత్రుడు కేశవ పెద్ద కుమారుడు కనపర్తి జస్వంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆహార వితరణకు అయిన ఖర్చు 2500/-లను అందించారని సురేందర్‌రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here