వాలంటీర్లకు ‘నారా’ మాస్క్‌లు

0
12 వీక్షకులు
వాలంటీర్లకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్న దృశ్యం

గుంటూరు, జూన్ 17 (న్యూస్‌టైమ్): బాపట్ల 27వ వార్డు రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) ఫౌండర్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఎన్ఎఆర్ఎ బాపట్ల శాఖ, బాపట్ల నియోజకవర్గ సెక్రటరీ జల్లూరు శ్రీనివాసరావు నాయకత్వంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో రెడ్ జోన్ ప్రాంతంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు, పోలీసు సిబ్బంది, అధికారులకు సెల్యూట్ చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాటుకు గురైన జర్నలిస్టు మిత్రుడు మనోజ్‌కుమార్‌కు నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశామన్నారు. దేశ ప్రజల కోసం సరిహద్దులలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి వీరమరణం పొందిన, ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ సంతోష్ బాబుకు సెల్యూట్ చేస్తున్నామని, ఆ తల్లికి శతకోటి వందనాలు అన్నారు.

కొవిడ్-19 విపత్కర పరిస్థితులలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన బాపట్ల సీఐ అశోక్‌కుమార్‌ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న నేపథ్యంలో అశోక్‌కుమార్‌ను యూనియన్ నాయకులు అభినందించారు. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ బాపట్ల సభ్యులు, వార్తా ప్రపంచం బాపట్ల టౌన్ రిపోర్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఎమర్జెన్సీ టైంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లకు శానిటరీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

గతంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్ సమయంలో బాధితులకు సేవలు చేశామని, కేరళ వరద బాధితులకు సైతం తమ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేతృత్వంలో తగిన సహాయం చేశామని అన్నారు. కార్యక్రమంలో 27వ వార్డు గ్రామ వాలంటీర్లు, గ్రూప్ అడ్మిన్, శానిటరీ సిబ్బంది, ఎన్.ఎ.ఆర్.ఎ. బాపట్ల సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here