అనంతపురం, మే 4 (న్యూస్‌టైమ్): రంజాన్ పండుగను పురస్కరించుకుని చాందిని మసిద్ చారిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని పీటీసీ ఎదురుగా ఉన్న చాందిని మసీదులో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ఎవ్వరు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, తప్పని సరి పరిస్థితుల్లో బయటి వస్తే మాస్క్‌ను ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలంన్నారు.