తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

71
ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అందిస్తున్న పోకర్‌న్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. పోకర్న గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేస్తున్న నాష్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎన్ రెడ్డి, డైరెక్డర్ వివిఎస్ రెడ్డి. చిత్రంలో తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి

అలాగే, నాష్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎన్ రెడ్డి, డైరెక్డర్ వివిఎస్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.