వ్యాపిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తయారవుతున్న వ్యాక్సిన్ ఇంకా పురిటినొప్పుల దశలోనే ఉంది. చాలామందికి టీకా అనగానే వైరస్‌ను నిర్వీర్యంచేసి మన శరీరంలోకి పంపి దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తిచేయిస్తారని తెలుసు. అయితే ఇది సంప్రదాయ పద్ధతి. ఇవి కాకుండా మరో మూడు పద్ధతులున్నాయి. వైరస్‌లోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తిచేయడం, వైరస్‌ ప్రొటీన్లను మనకు హానిచేయని సూక్ష్మజీవిలోకి ప్రవేశపెట్టడం, మన డీఎన్‌ఏ/ఆర్‌ఎన్‌ఏకు ఒక జెనెటిక్‌ కోడ్‌ను పంపి, ఆ సూక్ష్మజీవిని చంపగలిగే ప్రతిరక్షకాలను ఉత్పత్తిచేయించడం.

ఒక్కో సంస్థ ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంది. మన హైదరాబాద్‌లోనే భారత్‌ బయోటెక్‌ సంప్రదాయ పద్ధతిని ఎంచుకొంటే, బయోలాజికల్‌ ఈ, ఇండియన్‌ ఇమ్యూనాలజీస్‌ డీఎన్‌ఏ/ఆర్‌ఎన్‌ఏ విధానంలో ప్రయోగాలుచేస్తున్నాయి. మనదేశంలో భారత్‌ బయోటెక్‌, జైడస్‌కాడ్లా అభివృద్ధిచేసిన టీకాలు సహా ప్రపంచవ్యాప్తంగా 27 వ్యాక్సిన్లు మానవ ప్రయోగదశలో ఉన్నాయి. ఇంకో 150 వరకు ప్రయోగాలు ప్రీ క్లినికల్‌దశలో అంటే వ్యాక్సిన్‌ అభివృద్ధి, జంతువులపై ప్రయోగదశలో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సామాన్యుడి మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ మరికొన్ని నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నది స్పష్టమైంది. వచ్చే ఏడాది ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో టీకా వస్తుందని స్వయంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైం టిస్ట్‌ సౌమ్యస్వామినాథన్‌ గత మంగళవారం పేర్కొన్నారు.

మనదేశంలో భారత్‌ బయోటెక్‌ జైడస్‌కాడ్లా అభివృద్ధిచేసిన టీకాలు సహా ప్రపంచవ్యాప్తంగా 27 వ్యాక్సిన్లు మానవ ప్రయోగదశలో ఉన్నాయి. ఇందులో ఐదు టీకాలు ఫేజ్‌-3లో కొనసాగుతున్నాయి. ఇంకో 150 వరకు ప్రయోగాలు ప్రీ క్లినికల్‌దశలో ఉన్నాయి. ఈ క్రమంలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇన్ని వ్యాక్సిన్లు ఎందుకు? అందరూ కలిసి పనిచేయొచ్చు కదా? ఒక టీకా విజయవంతమైతే అందరూ కలిసి ఒకేసారి ఉత్పత్తి చేస్తారా? తద్వారా తక్కువ సమయంలోనే అందరికీ అందుతుంది కదా? ఇలా అనేక రకాల ప్రశ్నలకు వైద్యనిపుణుల సమాధానాలు.. ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో వ్యాక్సిన్‌ తయారుచేస్తుంది. అందులోని మౌలిక వసతులు, యంత్రాలు దానికి అనుగుణంగా ఉంటాయి. వాటిని మార్చడానికి భారీగా ఖర్చుతోపా టు ఏడాదికిపైగా సమయం పడుతుంది. కాబట్టి తమ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేయగలిగే సంస్థలతోనే తయారీ కంపెనీలు జట్టుకడుతాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నెలలోపే కనీసం 10 కోట్లనుంచి 20 కోట్ల డోసులు విడుదలచేసేందుకు అన్ని కంపెనీలు ముందస్తు ఏర్పాట్లుచేసుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కనీసం 300 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎంత భారీగా పెంచినా అం దరికీ అందడానికి కనీసం 6 నుంచి 10 నెలలు పడుతుంది. వ్యాక్సిన్‌ రాగానే పదేండ్లలోపు చి న్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, వైద్యసిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు వేయాలని డబ్ల్యూహెచ్‌వో చెప్తున్నది. టీకా సామర్థ్యం తెలిస్తేనే ఎన్ని డోసులు ఇవ్వాలనేదానిపై స్పష్టత వస్తుంది.ప్రాథమిక సమాచారం ఆధారంగా రెండు డోసులు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. అందరూ వైరస్‌ బారిన పడాల్సిందేనన్న వాదన శుద్ధ అబద్ధం. ప్రభుత్వాలు సూచించినట్టు కొవిడ్‌-19 పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చు. కరోనా సోకినవారికి తెలంగాణ ప్రభు త్వం పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నది.

60 శాతానికిపైగా ఇంట్లోనే ఉంటూ చికిత్స పొంది వైరస్‌పై విజయం సాధించారని గుర్తుంచుకోవాలి. దవాఖానకు వెళ్లాల్సిన అవసరం కొందరికే ఉంటున్నది. ఇక ఆక్సిజన్‌ అవసరమయ్యేవారు 5 శాతం మాత్రమే ఉంటే 1 నుంచి 2 శాతం మాత్ర మే వెంటిలేటర్‌పై ఉంటున్నారు. ఈ సౌకర్యాలన్నీ ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నా యి. ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 170 బృందాలు వ్యాక్సిన్‌ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇన్ని ప్రయోగాల వెనుక రెండు కారణాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ ప్రయోగాలు చాలా రిస్క్‌తో కూడుకున్నవి. ఇందులో సక్సెస్‌ రేటు 25% మాత్రమే. ఏప్రిల్‌ నుంచి సుమారు వందకుపైగా బృందాలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పాల్గొన్నాయి. ఇందులో 27 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. అంటే సుమారు 25%. ఇందులో ఇప్పటివరకు 5 మాత్రమే ఫేజ్‌-3 వరకు వచ్చాయి. అంటే దాదాపు 20%. వీటిల్లో ఒకటో రెండో ప్రజలకు చేరువవుతాయి. మిగతావన్నీ వ్యర్థమని కాదు.. జరిగిన తప్పులను సరిచేసుకుంటూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఒకే వ్యాక్సిన్‌పై పరిశోధనచేసి.. అది విజయవంతం కాకుంటే మళ్లీ ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌, ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌.. ఇలా కాలయాపన అవుతుంది.