వేగవంతమైన కొవిడ్ పరీక్షకు డీఎస్‌టీ మద్దతు

0
11 వీక్షకులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): కోవిడ్ -19 వేగవంతమైన నిర్ధారణ పరీక్ష చేసే పరికరాన్ని రూపొందించిన పూణెకు చెందిన ఆరోగ్య సంరక్షణ అంకుర సంస్థకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి) మద్దతునిచ్చింది. మాడ్యూల్ ఇన్నోవేషన్స్‌కు నిధులు సమకూర్చడంలో భాగంగా, 10 నుంచి 15 నిముషాల్లో కోవిడ్ -19 పరీక్షలు చేసే ఈ పరికరాన్ని రూపొందించారు. యూ సెన్స్ నుంచి నిరూపితమైన భావనను ఉపయోగించి, ఎన్.సి.ఓ. వి.ఎస్.ఈ.ఎన్.ఎస్.ఈ. ఎస్(టి.ఎం)ను అభివృద్ధి చేస్తోంది. ఇది మానవ శరీరంలోని కోవిడ్-19కి వ్యతరేకంగా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలను గుర్తించడానికి వేగవంతమైన పరీక్షా పరికరం. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో, మాస్ స్క్రీనింగ్ చేయడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ వేగవంతమైన పరీక్షా పరికరంతో రోగుల్లో సంక్రమణను నిర్థారించడం, రోగులు కోలుకున్నారో లేదో నిర్థారించడం, రోగుల్లో సంక్రమణ దశను కూడా గుర్తించడం సాధ్యమౌతుంది. రియల్ లైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్.టి-పి.సి.ఆర్) ప్రస్తుత నిర్థారణ పద్ధతి గోల్డ్ స్టాండర్డ్ ఖరీదైనదే కాకుండా, ఎక్కువ సమయం పట్టడం, శిక్షణను అందించడం అవసరం. కానీ ప్రస్తుతం కనిపెట్టిన వేగవంతమైన పరీక్ష తక్కువ ఖర్చుతో సమస్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది పి.సి.ఆర్. బేస్డ్ కన్ఫర్మేటరీ టెక్నిక్ కు ప్రత్యామ్నాయం కానప్పటికీ, యాంటీబాడీస్‌ను గుర్తించడంపై ఆధారపడిన పరీక్షలు వేగంగా మాస్ స్క్రీనింగ్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా మోహరించబడుతున్నాయి. ఇవి పరిమిత సంఖ్యంలో పి.సి.ఆర్. యంత్రాల నుంచి భారాన్ని తగ్గించడమే కాకుండా, సూత్రీకరణ కోసం సహాయపడతాయని శాస్త్ర, సాంకేతిక విభాగ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు.

వైరల్ ఇన్ఫెక్షన్ ప్రారంభమైన తర్వాత మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఐ.జి.జి, ఐ.జి.ఎం. ప్రతి నిరోధకాలను గుర్తించడం ఎన్.సి.ఓ. వి.ఎస్.ఈ.ఎన్.ఎస్.ఈ. పరీక్ష, కోవిడ్ -19 కోసం ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్లకు వ్యతిరేకంగా పని చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ అంకుర సంస్థ జాతీయ ఏజెన్సీల సరైన ధృవీకరణ తర్వాత 2 నుంచి 3 నెలల వ్యవవధిలో పరీక్షలను అమలు చేయడానికి యోచిస్తోంది. భవిష్యత్తులో ఇది కోలుకున్న వ్యక్తులను గుర్తించడానికి, వారికి ప్రధాన విభాగంలో పనిని ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు, ఇలాంటి అనేక ప్రదేశాల్లో రోగులను, ప్రయాణికులను పరీక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా భవిష్యత్తులో దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది. దీని సాంకేతికత యొక్క సాధ్యాసాధ్యాలు నిరూపించబడినప్పటికీ, ఉత్పత్తి కార్యాచరణను వివరించే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి), ప్రోటోటైప్ ప్రదర్శించవలసి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here