న్యూఢిల్లీ, మే 1 (న్యూస్‌టైమ్): ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రగతి కారణంగా రైల్వేల్లో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిపే వ్యవస్థను ప్రవేశానికి అవకాశం ఏర్పడింది. దీనితో సులభతర వాణిజ్య నిర్వహణా ప్రక్రియ రైల్వేల్లో ఊపందుకుంది. సరకు రవాణా చార్జీలు, అనుబంధ చార్జీలతో సహా అన్ని రకాల చార్జీల చెల్లింపు ప్రక్రియ మరింత సరళతరంగా, సౌకర్యవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా మారింది. వినియోగదారులు చెల్లించాల్సిన వివిధ రకాల చార్జీల చెల్లింపు ప్రక్రియకు దోహదపడేలా వెబ్‌ను తీర్చిదిద్దడంతో ఇది సాధ్యమవుతోంది.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా జరిగే సరకురవాణా చార్జీల చెల్లింపులకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. సరకురవాణా చార్జీల వాణిజ్య అభివృద్ధి (ఎఫ్.బి.డి.) పోర్టల్ ద్వారా భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ.) చెల్లింపు గేట్వే మద్దతుతో ఈ ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సరకు రవాణా చార్జీ అన్ని రకాల అనుబంధ చార్జీల సేకరణకు ఈ వ్యవస్థ అవకాశం కల్పిస్తోంది. ఉదాహరణకు.. ప్రీమియం ఇండెంట్ విషయంలో ప్రీమియం చార్జి, వ్యాగెన్ రిజిస్ట్రేషన్ చార్జీ, డెమరేజీ, సరకుల నిల్వ చార్జీ, లోడింగ్ అన్ లోడింగ్ చార్జీ, షంటింగ్ చార్జి, రీబుకింగ్ చార్జి, డైవర్షన్ చార్జి, వంటివి సేకరించే సదుపాయాన్ని ఈ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. ఎఫ్.బి.డి. వెబ్ పోర్టల్ ద్వారా జరిగే ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ నిర్విరామంగా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు 2021వ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

సరకు రవాణా చార్జీల ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థకోసం రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శ సూత్రాల్లో కీలకాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి: ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థ: ఎఫ్.బి.డి. పోర్టల్, ఎస్.బి.ఐ. గేట్వే ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ పని చేస్తుంది. సరకు రవాణా చార్జీలు, అన్నిరకాల అనుబంధ చార్జీల వసూలు చేయడానికి ఇది దోహదపడుతుంది. ఎఫ్.బి.డి. పోర్టల్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థ, 24 గంటలూ నిర్విరామంగా అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకో దలచిన వినియోగదారు/ద్వితీయ శ్రేణి వినియోగదారు ఎఫ్.బి.డి. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటంది. ఎలక్ట్రానిక్ డిమాండ్ రిజిస్ట్రేషన్ (ఇ-ఆర్.డి.) విధానంలో పొందుపరిచిన పద్ధతి ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటుంది.

ఈ వ్యవస్థ ప్రకారం, సరకును పంపించే కన్సైనర్/సరకును అందుకునే కన్సైనీని వినియోగదారుగా ఎండోర్సీగా వ్యవహరిస్తారు. హ్యాండ్లింగ్ ఏజెంట్‌ను సెకండరీ కస్టమర్.గా వ్యవహరిస్తారు. ఇ-ఆర్.డి. ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులు ఈ సదుపాయం కోసం మరోసారి రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు. వినియోగదారు (కస్టమర్) తన ఎండోర్సీ లేదా హ్యాండ్లింగ్ ఏజెంటను సెకండరీ కస్టమర్‌గా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, తాను కోరుకునే చార్జీ పేరును సూచిస్తాడు. (సరకు రవాణా చార్జి, ప్రీమియం చార్జి, వ్యాగెన్ రిజిస్ట్రేషన్ చార్జీ వంటివి సూచించే అవకాశం ఉంటుంది. ఈ చార్జీలను కస్టమర్ తరఫున సెకండరీ కస్టమర్ చెల్లిస్తాడు. అయితే, అమలులో ఉండే మార్గదర్శక సూత్రాల ప్రకారం రైల్వే చార్జీల బకాయిలు చెల్లించే బాధ్యత కస్టమర్ (కన్సైనగర్ లేదా కన్సైనీ)పై ఉంటుంది. అన్ని చెల్లింపులకు బాధ్యత వహిస్తాడు.

ఆన్‌లైన్ చెల్లింపు సదుపాయం అన్ని పద్ధతుల ద్వారా అందుబాటులో ఉంటుంది. నెట్ బ్యాంకింగ్/ఆర్.టి.జి.ఎస్./నెఫ్ట్, క్రెడిడ్ కార్డు/డెబిట్ కార్డు/టి.ఎం.ఎస్. లొకేషన్ లోని కస్టమర్ డ్యాష్ బోర్డు యు.పి.ఐ. వంటి పద్థతుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. గూడ్స్ క్లర్క్ డ్యాష్ బోర్డు: ఇ-రిజిస్టర్డ్ వినియోగదారులకోసం: గూడ్స్ క్లర్క్ కోసం ఒక డ్యాష్ బోర్డును అందుబాటులో ఉంచుతారు. గూడ్స్ క్లర్క్ తన యూజర్ ఐ.డి. సహాయంతో లాగిన్ కాగానే, రిజిస్టరయిన కస్టమర్, సెకండరీ కస్టమర్ల వివరాలన్నింటినీ చూడగలుగుతాడు. అలాగే, వారి కోడ్, జి.ఎస్.ఐ.ఎన్ నంబరు వంటి వివరాలను కూడా గూడ్స్ క్లర్క్ చూడటానికి వీలుంటుంది. సరకు రవాణా చార్జీలు, ప్రీమియం చార్జీలు, వ్యాగెన్ రిజిస్ట్రేషన్ రుసుం, లోడింగ్ అన్ లోడింగ్ చార్జీలు, షంటింగ్ చార్జీలు, సరకు నిల్వ చార్జీలు, రీబుకింగ్ చార్జి, డైవర్షన్ చార్జీ వంటి వాటిని కస్టమర్ తరఫున గూడ్స్ క్లర్క్ తన డ్యాష్ బోర్డు ద్వారా చూసేందుకు అవకాశం ఉంటుంది. కస్టమర్, సెకండరీ కస్టమర్ చార్జీలను కూడా అవసరానికి అనుగుణంగా ఈ వ్యవస్థ పెంచగలుగుతుంది. ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా ఒకసారి చెల్లింపులు జరగగానే, అవే వివరాలు గూడ్స్ క్లర్క్ డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. చెల్లింపు ధ్రువీకరణ జరగ్గానే గూడ్స్ క్లర్క్ డ్యాష్ వ్యవస్థ సదరు సమాచారాన్ని తెలియజేస్తుంది. వసూలు వివరాలను వ్యవస్థ కూడా తాజా సమాచారంతో నవీకరిస్తుంది. చెల్లింపు ధ్రువీకరణ పూర్తి కాగానే రైల్వే రసీదు/మనీ రసీదు/జి.ఎస్.టి. ఇన్వాయిస్ వంటివి గూడ్స్ క్లర్క్ తయారు చేయడానికి వీలుంటుంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు జరిగిన వెంటనే ప్రతి చెల్లింపునకూ, ఒకటి చొప్పున చెల్లింపు ధ్రువీకరణ స్లిప్పు ఉత్పన్నం కావడానికి వ్యవస్థ దోహదపడుతుంది. గూడ్స్ క్లర్క్ రికార్డుకోసం ఈ ప్రక్రియ జరుగుతుంది. వ్యవస్థలో నమోదు చేసిన వివరాలను బ్యాలెన్స్ షీటులోకి పొందుపరిచే ఏర్పాటు ఉంటుంది. రీ రిజిస్టర్ అయిన కస్టమర్ లేదా సెకండరీ కస్టమర్ ఎవరైనా డిమాండ్ డ్రాఫ్టు, చెక్కు, నగదు రూపంలో నేరుగా గూడ్స్ క్లర్కుకు చెల్లింపు జరపాలనుకున్నపుడు, గూడ్స్ క్లర్కు కూడా సదరు చెల్లింపును తీసుకునే ఏర్పాటు, అదే అంశాన్ని రసీదును సూచిస్తూ అక్కడికక్కడే డ్యాష్ బోర్డులో నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా రైల్వే రసీదు/మనీ రసీదు/జి.ఎస్.టి. ఇన్వాయిస్ వంటివి గూడ్సు క్లర్కే జనరేట్ చేయగలిగే వీలు ఉంటుంది.

ఇ- రిజిస్టర్ కాని వినియోగదారుల కోసం:

ఇ-రిజిస్ట్రేషన్ చేసుకోని వినియోగదారుల డిమాండ్‌ను రిజిస్టర్ చేసేటపుడు సదరు వినియోగదారు వివరాలను నమోదు చేసి, ఇండెంట్ సంఖ్యను గుర్తించే ప్రత్యామ్నాయం గూడ్స్ క్లర్క్ కు ఉంటుంది. దానికి అనుగుణంగా వ్యాగెన్ రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రీమియం చార్జి, సరకు రవాణా చార్జి వంటి వాటిని ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్. ద్వారా లెక్కించవలసి ఉంటుంది. అలాంటి కస్టమర్‌కు సంబంధించిన సైడింగ్ చార్జి, షంటింగ్ చార్జి, డెమరేజీ, రీబుకింగ్ చార్జి, డైవర్షన్ చార్జి వంటి వివరాలను గూడ్స్ క్లర్కే పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మార్గదర్శక సూత్రాల ప్రకారం రైల్వే రసీదు/మనీ రసీదు/జి.ఎస్.టి. ఇన్వాయిస్ వంటి వాటిని గూడ్స్ క్లర్కే తయారు చేసే వెసులుపాటు ఉంటుంది. పైన ఇచ్చిన వివరాలు, సిస్టమ్.లో పొందుపరిచిన వివరాలు నేరుగా బ్యాలెన్స్ షీటులోకి తీసుకుంటారు.

ఇ-రిజిస్టరయిన వినియోగదారు డ్యాష్ బోర్డు:

కస్టమర్/సెకండరీ కస్టమర్ తాము చెల్లించాల్సిన బకాయి చార్జీలకు సంబంధించి, తమతమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు, ఈ మెయిల్ ఐడీకి మెస్సేజీ వస్తుంది. రైల్వే చార్జీల బకాయిలను మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఆలస్యంగా జరిగే చెల్లింపులకు లేటు చార్జీలను కూడా వర్తింపజేస్తారు. ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థలోకి ఎఫ్.బి.డి. పోర్టల్ ద్వారా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యే వెసులుబాటు కస్టమర్/సెంకడరీ కస్టమర్‌కు ఉంటుంది. కస్టమర్/సెకండరీ కస్టమర్ చెల్లించిన చార్జీల వివరాలు కస్టమర్/సెకండరీ ఖాతాల్లో చూసే వీలుంటుంది. అన్నిరకాల చార్జీలను కస్టమర్ చెల్లించగలిగే ఏర్పాటు వ్యవస్థలో ఉంటుంది. సెకండరీ కస్టమర్ కు అప్పగించిన చార్జీలతో సహా అన్ని చార్జీలను కస్టమర్ చెల్లించగలిగే వీలుంటుంది. అలాగే, కస్టమర్ తనకు ఎలాంటి చార్జీలను అప్పగిస్తే అలాంటి చార్జీలను చెల్లించే గలిగే వెసులుబాటు సెకండరీ కస్టమర్‌కు ఉంటుంది. ప్రతి ఖాతాకూ చెల్లించవలసిన చార్జీలను ఎంపిక చేసుకుని చెల్లించేందుకు కస్టమర్‌ను అనుమతిస్తారు. కస్టమర్ కూడా తన వ్యక్తిగత చార్జీలను ఎంపిక చేసుకుని, వాటి చెల్లింపుకోసం ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది.

అందుబాటులో ఉన్న వివిధ పద్ధతుల ద్వారా చెల్లింపును ఎంపిక చేసుకుని దాన్ని అధీకృతం చేసుకునే వెసులుబాటును చెల్లింపు గేట్వే వ్యవస్థ కస్టమర్‌కు కల్పిస్తోంది. ఒకసారి కస్టమర్ విజయవంతంగా చెల్లింపు జరపగానే, సదరు కస్టమర్.ను చెల్లింపు అప్లికేషన్ వైపునకు మళ్లించే ఏర్పాటు ఈ వ్యవస్థలో ఉంది. సదరు చెల్లింపు వివరాలను ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్. అప్లికేషన్లలో వ్యవస్థ నవీకరిస్తుంది. దీనితో అతను లేదా ఆమె ఇతర చెల్లింపులతో ముందుకు సాగవచ్చు. ఒకసారి చెల్లింపు పూర్తయితే వెంటనే సదరు వివరాన్ని కస్టమర్ డ్యాష్ బోర్డు సూచిస్తుంది. సెకండరీ కస్టమర్ చెల్లింపు విజయవంతమైన సందర్భంలో కూడా వెంటనే చెల్లింపునకు సంబంధించిన వివరాలు కస్టమర్ డ్యాష్ బోర్డులో కనిపించేలా ఏర్పాటు చేశారు. రైల్వే రసీదు/మనీ రసీదు సంబంధిత జి.ఎస్.టి. ఇన్వాయిస్ ఉత్పన్నమైన వెంటనే సదరు వివరాలు కస్టమర్ అప్లికేషన్.కు పంపబడతాయి. అలాగే, అదే వివరాలు పి.డి.ఎఫ్. ఫైలు రూపంలో ఈ మెయిల్ ఐడీకి చేరతాయి. కాగా, తాము ఎదుర్కొంటున్న సమస్యలను, అంశాలను ప్రస్తావిస్తూ కస్టమర్ ఈ వ్యవస్థలో పొందుపరిచే ఏర్పాటు ఉండాలి. జోనల్ రైల్వే, సి.ఆర్.ఐ.ఎస్., ఎఫ్.ఒ.ఐ.ఎస్. కాలబద్ధమైన వ్యవధిలో సమస్యలను పరిష్కరించేందుకు వీలు కలిగిస్తూ ఈ ఏర్పాటు ఉండాలి. ఆవశ్యక పరిస్థితిలో చెల్లించిన మొత్తానికి సంబంధించి కస్టమర్ బ్యాంకు ఖాతానుంచి డబ్బు డెబిట్ అయిపోయి, సదరు వివరాలు ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్. లలో ప్రతిఫలించని పక్షంలో చెల్లింపుకోసం కస్టమర్ తిరిగి ప్రయత్నించే వెసులుబాటు ఉంటుంది.

చెల్లింపుకోసం తిరిగి ప్రయత్నించినపుడు చెల్లింపు గేట్వే నుంచి ఇదివరకటి లావాదేవీ పరిస్థితి గురించి వ్యవస్థ కోరుతుంది. ఇదివరకటి చెల్లింపు లావాదేవీ విజయవంతమైన పక్షంలో సదరు లావాదేవీకి సంబంధించి స్థితిని వ్యవస్థ నవీకరిస్తుంది. అప్పుడు రైల్వే రసీదు/మనీ రసీదు/జి.ఎస్.టి. ఇన్వాయిస్ సునాయాసంగా ఉత్పన్నమవుతుంది. ఒకవేళ చెల్లింపునకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీ విజయవంతం కాని పక్షంలో వ్యవస్థ కూడా తాజా బిల్లు వసూలు లావాదేవీని మొదలు పెడుతుంది. ఏదైనా చెల్లింపు లావాదేవీ ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్. వ్యవస్థలో విఫలమైనా, కస్టమర్ ఖాతానుంచి డబ్బు డెబిట్ అయినపుడు, సదరు డబ్బును తిరిగి ఖాతాకు పంపించే ప్రక్రియను వ్యవస్థే స్వయంగా ప్రాసెస్ చేసే ఏర్పాటును పొందుపరిచారు.
ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా కస్టమర్, సెకండరీ కస్టమర్ చెల్లింపు జరపలేకపోయినా, లేదా ఆన్ లైన్ లో చెల్లించడానికి కస్టమర్ ఇష్టపడకపోయినా అలాంటి ఆవశ్యక పరిస్థితి తలెత్తినపుడు, డ్రాఫ్టు, చెక్కు, నగదు రూపంలో అక్కడికక్కడే చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ ప్రక్రియ:

ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా అందుకున్న మొత్తాన్ని బ్యాంకు తిరిగి వాపసు చెల్లించేందుకు ఈ కింది సందర్భాల్లో అవకాశం ఉంటుంది. డబ్ల్యు.ఆర్.ఎఫ్. వాపస్: ఆన్ లైన్ ద్వారా చెల్లించిన వ్యాగెన్ రిజిస్ట్రేషన్ ఫీజు (డబ్ల్యు.ఆర్.ఎఫ్.) వాపసు (రీఫండ్) పొంపొందేందుకు రీఫండ్ విధానానికి అనుగుణంగా ఎఫ్.ఒ.ఐ.ఎస్. ఒక రీఫండ్ ఫైలును ఉత్పన్నం చేస్తుంది. అదే ఫైలును వాపసు చెల్లింపు ఏర్పాటుకోసం ఎస్.బి.ఐ.కి పంపిస్తారు. ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ (పి.ఆర్.ఎస్.), అన్ రిజర్వ్డ్ టికెటింగ్ వ్యవస్థ రీఫండ్ పద్ధతిలోనే ఈ ఫైలును పంపిస్తారు. రీఫండ్ జాబితానే రీఫండ్ వోచర్ గా సంబంధిత స్టేషన్ పరిగణిస్తుంది. ఈ రీఫండ్ వోచర్ బ్యాలెన్స్ షీటులో భాగంగా ఉంటుంది. ఆన్ లైన్ బ్యాలెన్స్ షీటు ద్వారా ఈ వోచర్ ట్రాఫిక్ అక్కౌంట్ ఆఫీసుతో అనుసంధానమై ఉంటుంది. తక్కువ దూరం ఉన్న మార్గానికి దారి మళ్లింపు జరిపినందున నిర్వహణా కారణాలపై సరకు రవాణా చార్జీ వాపస్: ఆన్ లైన్ ద్వారా చెల్లించిన ఈ సరకు రవాణా చార్జీని దారి మళ్లింపు కారణంపై వాపసు చెల్లించేందుకు ఆర్.ఆర్. సస్పెన్షన్ ప్రక్రియను ఎఫ్.ఒ.ఐ.ఎస్. వ్యవస్థ ఉత్పన్నం చేస్తుంది. అలాగే, రీఫండ్ ఫైలును తయారు చేసి, అదే ఫైలును ఎస్.బి.ఐ.కి పంపిస్తుంది. ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ, అన్ రిజర్వ్డ్ టికెటింగ్ వ్యవస్థలో బుక్ చేసిన టికెట్ల రీఫండ్ పద్ధతిలోనే ఈ ఫైలును పంపిస్తారు. రీఫండ్ లిస్టునే రీఫండ్ వోచర్ గా సంబంధిత స్టేషన్ పరిగణిస్తుంది. డబ్లు.ఆర్.ఎఫ్. రీఫండ్ కు అనుసరించిన పద్ధతినే ఇక్కడా పాటిస్తారు.

డెమరేజీ, సరకు నిల్వ చార్జీల రీఫండ్: ఆన్ లైన్ ద్వారా చెల్లింపు జరిగిన డెమరేజీ, సరకు నిల్వ చార్జీల వాపసు చెల్లింపునకు సంబంధించి గూడ్స్ క్లర్క్ చెల్లింపు ఆర్డర్ ను తయారు చేసేందుకు వీలుంటుంది. తగిన అధీకృత సంస్థ ఇందుకు మంజూరు చేస్తుంది. ఈ చెల్లింపు ఆర్డర్ ప్రాతిపదికగా రీఫండ్ ఫైలును ఉత్పన్నం చేసి సంబంధిత పార్టీకి చెల్లింపు ఏర్పాట్లకోసం కోసం ఎస్.బి.ఐ.కి పంపిస్తారు. ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ, అన్ రిజర్వర్డ్ టెకెటింగ్ వ్యవస్థలో వాపసు చెల్లింపునకు అనుసరించిన పద్ధతినే ఇక్కడా అనుసరిస్తారు. కొత్తగా రూపొందించిన ఈ వ్యవస్థ తనంతట తానే రాజీకి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. లావాదేవీ జరిగిన మరుసటి రోజునే చెల్లింపు మొత్తం వాపసుకు ఏర్పాటు, ఇందుకోసం విజయవంతమైన లావాదేవీలతో కూడిన ఎఫ్.ఒ.ఐ.ఎస్, టి.ఎం.ఎస్. వ్యవ్థకు ఒక నివేదికను చెల్లింపు గేట్వే అందిస్తుంది. చెల్లింపు సెటిల్మెంట్ విజయవంతమైన స్థితి ఆధారంగా పేమెంట్ గేట్వే సంస్థనుంచి నివేదిక అందిన వెంటనే దాని ప్రాతిపదికగా ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్. లావాదేవీల జాబితాను క్వెరీ రిపోర్టు రూపంలో ఉత్పన్నం చేస్తుంది. ఈ క్వెరీ రిపోర్టును రాజీ కోసం ఎక్స్ సెప్షన్ రిపోర్టుగా రూపొందిస్తారు. రాజీ తర్వాత కూడా ఏదైనా వ్యత్యాసం ఏర్పడిన పక్షంలో (అంటే రెండు సార్లు బ్యాంకు ఖాతానుంచి మొత్తం డెబిట్ కావడం, కస్టమర్ ఖాతానుంచి డబ్బు డెబిట్ అయినా ఎఫ్.ఒ.ఐ.ఎస్., టి.ఎం.ఎస్.లో కనిపించకపోవడం వంటివి జరిగినపుడు) లావాదేవీకి సంబంధించిన మొత్తాన్ని జోనల్ రైల్వే వాపసు చెల్లిస్తుంది.

ఇందుకోసం తగిన విధానాన్ని అనుసరిస్తూ చెల్లింపు జరుపుతారు. ప్రస్తుతం సరకు రవాణా చార్జీ వసూలుకోసం ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థ అమలులో ఉందన్నది గమనించాల్సి ఉంది. ఎక్కువ మంది వినియోగదారులకు ఇదే వ్యవస్థనే వర్తింప జేస్తున్నారు. అయితే, అప్పుడప్పుడు కొందరు వినియోగదారులు సంప్రదాయ పద్ధతిలోనే సరకు రవాణా చార్జీలను చెల్లిస్తున్నారు. పైగా, వ్యాగెన్ రిజిస్ట్రేషన్ ఫీజు, డెమరేజీ, సరకు నిల్వ చార్జీలు, షంటింగ్ చార్జీ వంటి అనుబంధ చార్జీలను కూడా వారు సంప్రదాయ పద్ధతిలోనే చెల్లిస్తూ వస్తున్నారు.