బక్క పలచగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ పాటించండి. అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి హై ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో హై ప్రోటీన్సే కాకుండా క్యాలరీలు, పోషకవిలువలు, ఫైబర్ కలిగి ఉంది. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో ఎండుద్రాక్ష, బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని చేర్చుకోండి. ఒక కప్పు ఎండు ద్రాక్షలో 449 క్యాలరీలు, అలాగే మరో కప్పు బాదంలో 529 క్యాలరీలు ఉన్నాయి. ఇటువంటి పోషక విలువలున్న డ్రై ఫ్రూట్స్‌ను పెరుగు లేదా ఐస్ క్రీమ్, సలాడ్లు ధాన్యాల మీద గార్నిషింగ్‌గా వేసుకొని తీసుకోవచ్చు.