న్యూఢిల్లీ, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): ఓట‌ర్ల సంఖ్య‌లో పెరుగుద‌ల‌, కాస్ట్ ఇన్‌ఫ్లేష‌న్ ఇండెక్సులో పెరుగుద‌ల ఇత‌ర అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల‌లో అభ్య‌ర్ధుల వ్య‌య‌ప‌రిమితి అంశాల‌ను ప‌రిశీలించేందుకు ఎన్నిక‌ల‌క‌మిష‌న్ మాజీ ఐఆర్ఎస్ అధికారి, డిజి (ఇన్వెస్టిగేష‌న్‌) హ‌రీష్ కుమార్‌, సెక్ర‌ట‌రీ జన‌ర‌ల్, డిజి (ఎక్స్పెండీచ‌ర్‌) ఉమేష్‌కుమార్‌ల‌తో ఒక క‌మిటీని ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మించింది.

కోవిడ్ -19ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని చ‌ట్ట‌, న్యాయ మంత్రిత్వ‌శాఖ 19-10-2020న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ నిబంధ‌న‌లు 1961లోని నిబంధ‌న 90కి స‌వ‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చి, ప్ర‌స్తుత ఎన్నిక‌ల వ్య‌య‌ప‌రిమితిని ప‌దిశాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల నుంచి ఈ 10 శాతం పెరుగుద‌ల అమ‌లులోకి వ‌స్తుంది. ఎన్నిక‌ల వ్య‌య‌ప‌రిమితిని చివ‌రి సారిగా 2014లో 28-02-2-14 నాటి నోటిఫికేష‌న్ ద్వారా స‌వ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణాల‌కు సంబంధించి 10-10-2018 న జారీ అయిన నోటిఫికేష‌న్‌ద్వారా స‌వ‌రించారు. గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో ఓట‌ర్ల సంఖ్య 834 మిలియ‌న్ల నుంచి 910 మిలియ‌న్ల‌కు 2019 నాటికి, ప్ర‌స్తుతం 921 మిలియ‌న్ల‌కు పెరిగింది. దీనికి తోడు, కాస్ట్ ఇన్‌ఫ్లేష‌న్ ఇండెక్సు ఈ కాలంలో 220నుంచి 2019లో 280కి ప్ర‌స్తుతం 301కి పెరిగింది.