న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): కొవిడ్-19 సమయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అనుమతించబడింది. దీని ప్రకారం, ఆహార పదార్థాల పంపిణీ, పోషకాహార సహాయాన్ని అంగన్వాడీ వర్కర్స్ (ఎడబ్లూడబ్యూలు) 15 రోజులకు ఒకసారి లబ్ధిదారులకు ఉదాహరణకు పిల్లలు, మహిళలు, పాలిచ్చే తల్లుల ఇంటి వద్దకు వెళ్లి అందించారు. అలాగే అంగన్‌వాడీ కార్మికులు, సహాయకులు కొవిడ్-19 అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సరైన పారిశుధ్యం, ఆరోగ్య, విద్య గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించారు. పిల్లలతో సహా లబ్ధిదారుల సంవత్సర వారీ వివరాలు (6 నెలలు – 6 సంవత్సరాలు), 2014 – 2020 సంవత్సరాల మధ్య అంగన్వాడీ సేవల పథకం కింద గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వివరాలను అందుబాటులో ఉంచింది కేంద్రం.

భారతదేశంలో అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనం నెలకు రూ. 3,000 / – నుండి రూ. 4, 500/కు పెరిగింది; మినీ అంగన్‌వాడీ సెంటర్లలో అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.2,250 /- నుండి రూ. 3,500 / -, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ. 1,500 /నుండి 2,250 /- వరకు పెంచడం జరిగింది.