న్యూఢిల్లీ, మే 9 (న్యూస్‌టైమ్): కోవిడ్-19కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ సామూహిక పోరాటంలో భాగంగా, భారతదేశం పట్ల సంఘీభావం, సద్భావనను ప్రతిబింబిస్తూ, భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేయూత నిస్తోంది. భారతదేశం అందుకున్న సహాయ సామాగ్రిని సమర్ధవంతంగా కేటాయించి, వెంటనే పంపిణీ చేయడం కోసం, భారత ప్రభుత్వం, ఒక క్రమబద్ధమైన, సంప్రదాయబద్దమైన యంత్రాంగాన్ని రూపొందించింది. ఈ ఆధునిక ప్రత్యేక సంరక్షణ సంస్థలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని, వైద్య మౌలిక సదుపాయాలను భర్తీ చేయడంతో పాటు, ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల సమర్థవంతమైన వైద్య నిర్వహణ కోసం వారి చికిత్స యాజమాన్య సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఇది సహాయ పడుతుంది.

2021 ఏప్రిల్ 27వ తేదీ నుండి భారత ప్రభుత్వం, వివిధ దేశాలు/సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 ఉపశమన వైద్య సామాగ్రి, పరికరాలను, స్వీకరిస్తోంది. 2021 ఏప్రిల్ 27వ తేదీ నుండి 2021 మే 7వ తేదీ వరకు, మొత్తం మీద, 6,608 ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్స్; 3,856 ఆక్సిజన్ సిలెండర్లు; 14 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 4,330 వెంటిలేటర్లు/బి-పి.ఐ.పి.లతో పాటు 3 లక్షల రెంమ్డేసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ/రవాణా చేయడం జరిగింది. యు.ఎస్.ఐ.ఎస్.పి.ఎఫ్; స్విట్జర్లాండ్; పోలాండ్; నెదర్లాండ్, ఇజ్రాయెల్ నుండి 2021 మే 7వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువుల్లో ఉన్నాయి. ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు (2060); రెంమ్డేసివిర్ (30,000); వెంటిలేటర్లు (467); ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు (03).

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంస్థలకు సమర్థవంతమైన తక్షణ కేటాయించి, ఒక క్రమ పద్ధతిలో పంపిణీ చేయడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరంతరం, సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. గ్రాంట్లు, సహాయం, విరాళాల రూపంలో వస్తున్న, విదేశీ కోవిడ్ సహాయ సామాగ్రిని స్వీకరించి, కేటాయించడానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఒక ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం 2021 ఏప్రిల్ 26వ తేదీ నుండి పనిచేయడం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి, 2021 మే 2వ తేదీ నుండి అమలు చేస్తోంది.