విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి

65

చిత్తూరు, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. బాధ్యత మరచి తక్కువ ఎత్తులో ఉన్న కరెంట్ తీగలను పైకి తీయాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులది కాదా? వీరిపైన వన్యప్రాణుల చట్టం కింద అటవీ శాఖ వారు కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.

చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం మండలం మొగలివారిపల్లి వద్ద పొలంలో కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉన్న కారణంగా ఏనుగు తొండనికి తగిలి కరెంటు షాక్ అవ్వడంతో అక్కడికక్కడే ఏనుగు మృతి, సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది జరిగిన ప్రదేశానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు గుడివంక ప్రాంతంలోనూ ఇటీవల ఏనుగులు బీభత్సం ఎక్కువైంది.

పొలం పనులకు వెళ్లాలంటేనే రైతులు, స్థానికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏనుగుల గుంపు మీద పడతాయో అన్న భయంతో గ్రామస్తులు గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పారెస్టు సిబ్బంది గ్రామస్తుల సహాయంతో ఏనుగుల గుంపును అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ ఏనుగులు అడవిలోకి వెళ్లినట్టుగా వెళ్లి తిరిగి వస్తున్నాయి.