సాధాసీదాగా ఎల్లమ్మ కల్యణం

17
74 వీక్షకులు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, జూన్ 6 (న్యూస్‌టైమ్): రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 23 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఆలయంలోనే వేదపండితుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

శనివారం మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, పోలీసు తదితర శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు తదితరులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ప్రావిణ్య, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఆలయ ఈవో శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపద్యంలో అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని వేదపండితులు, ఆలయ అధికారుల సమక్షంలో ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. కళ్యాణం అనంతరం రోజు అనగా 24 వ తేదీన రదోత్సవాన్ని కూడా ఆలయంలోనే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, కమిటీ సభ్యులు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితులను దృషిలో ఉంచుకొని భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే దాతలు కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని మంత్రి కోరారు. ఆలయం ముందు శాశ్వత రేకుల షెడ్డును దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు, ఆలయానికి వచ్చే భక్తుల వాహానాల పార్కింగ్ కోసం ఆలయం పక్కనే 5 కోట్ల రూపాయల ఖర్చుతో మల్టి లెవెల్ పార్కింగ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్డు మద్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, డివైడర్ల మద్య మొక్కలు నాటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అదేవిధంగా పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నాలుగు లేన్లుగా విస్తరించి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

17 COMMENTS

  1. I simply want to mention I’m all new to blogging and site-building and truly loved your page. Likely I’m likely to bookmark your blog . You certainly come with excellent articles. Appreciate it for sharing your website page.

  2. The when I just read a blog, I’m hoping that this doesnt disappoint me approximately this one. Get real, Yes, it was my method to read, but When i thought youd have something interesting to state. All I hear is a number of whining about something that you could fix should you werent too busy trying to find attention.

  3. Hello would you mind stating which blog platform you’re using? I’m going to start my own blog soon but I’m having a tough time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something completely unique. P.S Sorry for getting off-topic but I had to ask!

  4. Heya fantastic website! Does running a blog such as this take a massive amount work? I’ve virtually no understanding of coding however I had been hoping to start my own blog soon. Anyways, should you have any suggestions or techniques for new blog owners please share. I know this is off topic but I simply had to ask. Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here