కార్మిక ఫించను పథకాల నమోదు గడువుపెంపు

0
9 వీక్షకులు
సమావేశంలో మాట్లాడుతున్న విజయనగరం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనరు (డీసీఎల్) ఎన్. సుబ్రమణ్యం

విజయనగరం, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): జిల్లా కలెక్టరు డాక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశాల మేరకు అసంఘటిత కార్మికులు పీఎం శ్రమ్ యోగిమన్ ధన్ పింఛను పథకం, చిరు వ్యాపారులు పీఎం లఘ పరిశ్రమ మాన్ ధన్ పథకంలో నమోదు చేసుకొనేందుకు జిల్లా కార్మిక శాఖ గడువు పొడిగించినట్లు కార్మిక శాఖ ఉప కమిషనరు (డీసీఎల్) ఎన్. సుబ్రమణ్యం తెలిపారు. జిల్లాలో ఎక్కుమ మంది లబ్దిదారులు లబ్దిపొందేందుకు జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు నమోదు ప్రక్రియ పొడిగించామన్నారు.

అర్హులైన అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు ఈ పథకాలను సద్వీనియోగం చేసుకోవాలని డీసీఎల్ సూచించారు. అర్హులైన 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల వారు తమ దగ్గరలోని కామన్ సర్వీసు సెంటరులో తమ ఆధార్ నెంబరుతో అనుసంధానమైన బ్యాంకు అక్కౌంటు, సెల్ నెంబరు, అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు ఇచ్చి నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్, జాతీయ పింఛను వారోత్సవాలలో భాగంగా నవంబరు, 1 నుండి ఈ నెల 6 వరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, నమోదు శిబిరాలు ఏర్పాటు చేసామన్నారు. ప్రధానమంత్రి లఘ పరిశ్రమ మాన్ ధన్ ఫించను పథకంలో 600 మంది చిరు వ్యాపారులు నమోదు చేసుకొని రాష్ట్రంలో విజయనగరం జిల్లా రెండవ స్థానం పొందిదన్నారు. అదే విధంగా, పీఎం శ్రమ యోగి మాన్ ధన్ పథకంలో 4100 మంది అసంఘటిత కార్మికులు నమెదు చేసుకొని, రాష్ట్రంలో విజయనగరం జిల్లా 7వ స్థానం పొందిందని ఆయన తెలిపారు.

విజయనగరం సర్కిల్ 2 కార్మిక శాఖ అధికారి ఆర్.రమాదేవి మాట్లాడుతూ ఈ రెండు పథకాలు అసంఘటిత కార్మికులకు, చిరు వ్యాపారులకు ఎంతో ప్రయోజనమని, సాంఘిక భద్రత కల్పిస్తాయన్నారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సుగల వారు, ప్రీమియం 55 నుండి 200 వరకు చెల్లించాలన్నారు. 60 ఏళ్ల తర్వాత జీవిత కాలం ప్రతి నెల రూ.3 వేలు పించను ఇస్తారని తెలిపారు. అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున వినియోగించుకొని లబ్ది పొందాలని కొరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here