శృంగారం… సర్వరోగ నివారిణి!

258

మనిషికి ఇప్పుడున్న పరిస్థతిలో బతకడానికి శ్రమఎక్కువ చేయవలసి వస్తుంది. దీంతో మానసికంగా, శారీరకంగా అలసి పోతున్నారు. అంతే కాదు మహిళలు కూడా అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అనే ఆలోచన ధోరణిలో ఉన్నారు. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును ప్రశాంతంగా సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.

దీనికి అనువైన కార్యకలాపాలు, సరస సల్లాపాలు, మృదువైన, మనసుకు హత్తుకునే నాలుగు ప్రేమ మాటలు మాట్లాడాలి. ఇంటికి రాగానే తరచూ మీ పనుల్లో మీరు బిజీ కాకూడదు. వారితోను కాసేపు ముచ్చటించాలి. వారు చేసే ఇంటి పనుల్లో మీరు తోడుగా కలిసి సహాయపడుతూ వారి మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వారికి ఆ మూడ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురూ మనస్ఫూర్తిగా సెక్స్‌లో పాల్గొంటారో అప్పుడు శరీరంలోని మానసిక, శారీరక ఒత్తిడితోపాటు శరీరంలోనున్న నొప్పులు మటుమాయమౌతాయంటున్నారు పరిశోధకులు.