మచిలీపట్నంలో అందుబాటులో నిత్యావసర సరుకులు

0
12 వీక్షకులు

మచిలీపట్నం, మార్చి 28 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గత ఆదివారం జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటిదాకా గత వారం రోజులుగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ కూరలు, నిత్యావసరాలు కొనుగోలు కోసం లాక్‌డౌన్ సడలింపు ప్రభుత్వం అమలు చేస్తోంది. మచిలీపట్నంలో అందరూ ఒకే సారి రైతు బజారు వద్దకే వస్తూ గుంపులుగా రావడంతో సామాజిక దూరం పాటించేందుకు ప్రకటించిన లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరని పరిస్దితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్దితులను సమీక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి, ఆర్డిఓ ఇతర ఉన్నతాధికారులు రైతుబజారు వికేంద్రీకరించి చర్యలు తీసుకున్నారు.

పట్టణంలో 10 చోట్ల బహిరంగ ప్రదేశాలలో కూరలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేయడంతోప్రజలు వారికి సమీప ప్రాంతంలో కొనుగోలు చేస్తూ దుకాణాల వద్ద నెమ్మదిగా సామాజిక దూరం పాటించేందుకు అలవాటు పడుతున్నారు. కురగాయలు, నిత్యావసరాలు ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్ చేయడం, అధికధరలు విక్రయించడం జరిగితే అటువంటి వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించడంతో నిత్యావసర ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు జరుపుతున్నారు.

శనివారం మార్కెట్ యార్డులో కూరగాయలు ఆకుకూరలు కొనుగోలుకు విచ్చేసిన వినియోగదారులు పలువురు కూరగాయలు వాటి ధరలు అందుబాటులో ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పెడన 17వ వార్డుకు చెందిన సూర్యకుమారి మార్కెట్‌యార్డులో కూరగాయలు కొనుగోలు చేసిన అనంతరం తన అభిప్రాయం తెలియజేస్తు ఇంతటి విషత్కర పరిస్దితుల్లో ప్రభుత్వం ప్రజలకు కూరగాయలు అందుబాటులో వుండేలా ధరలు అదుపులో వుండేలా చేసిందని ఎలాంటి ఇబ్బందులు లేవని చిన్నాపురం గ్రామానికి చెందిన చినముత్తేవి వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డులో కూరగాయలు కొనుగోలు చేశామని, ఇక్కడ సమస్య లేదని అయితే గ్రామాలలో కూడా కూరగాయలు అయితే వాటి ధరలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్లమాన్నాడు గ్రామ సమీపంలో గల కొంగంచర్ల గ్రామం నుండి బందరు పని మీద వచ్చి ఈరోజు మార్కెట్ యార్డులో కూరగాయలు కొనుగోలు చేశానిని ధరలు అందుపులోనే వున్నాయని సంతృప్తివ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here