ఖమ్మంలో పేదలకు నిత్యావసర సరుకులు

0
10 వీక్షకులు

ఖమ్మం, ఏప్రిల్ 12 (న్యూస్‌టైమ్): నగరపాలక సంస్థ పరిధిలోని త్రీ టౌన్ మోతినగర్‌లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. డివిజన్లలో ఒక పాజిటివ్ కేసు రావడంతో అక్కడి పరిస్థితులను జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలకై డివిజన్ మొత్తం నిర్బంధంలోకి తీసుకోవాలని ఎవరు డివిజన్ లోపలికి రాకుండా, బైటకు పోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. భౌతిక దూరం పాటించడమే కరోనా మహమ్మారి నివారణకు మందు అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

కరోనా మహమ్మారి త్వరగా నశించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, తహసీల్దార్ శ్రీనివాస రావు, అధికారులు, కార్పొరేటర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here