ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

0
5 వీక్షకులు

మహబూబాబాద్, ఏప్రిల్ 8 (న్యూస్‌టైమ్): పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌ర‌ధిలోని పెద్ద‌వంగ‌ర‌లో ధాన్యం, మక్క‌జొన్న‌ల కోనుగోలు కేంద్రాల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు. రైతుల‌తో మాట్లాడి దిగుబ‌డులు తెలుసుకుని, వారి పంట‌ల‌ను మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊహించ‌ని విధంగా ప్ర‌పంచాన్ని కరోనా వైర‌స్ వ‌ణికిస్తున్న‌దని, అమెరికాలోని న్యూయార్క్, న్యూ జెర్సీ వంటి న‌గ‌రాల్లో కుప్ప‌లు కుప్ప‌లుగా జ‌నం మ‌ర‌ణిస్తున్నారని తెలిపారు. వ‌ర్ద‌మాన్ కోట నుండి వ‌డ్డే కొత్త‌ప‌ల్లికి ఓ వ్య‌క్తి వ‌చ్చాడని, అత‌డికి క‌రోనా పాజిటివ్ అని తెలిసిందన్నారు. వెంట‌నే అత‌డిని క్వారంటైన్‌కి త‌ర‌లించామన్నారు. అయినా, పెద్ద వంగ‌ర మండ‌లంలో క‌ల‌క‌లం చెల‌రేగిందని, ఎవ‌రూ ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేదని పేర్కొన్నారు.

‘‘మన సీఎం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం మంచి ఫ‌లితాలు ఇస్తున్న‌ది. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌నంద‌రినీ ప‌రీక్ష‌లు చేయించారు. మ‌ర్క‌జ్ వాళ్ళ నుంచే పెద్ద స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. అయినా ప‌రిస్థితి అదుపులోనే ఉంది. ఈ త‌రుణంలో రైతుల‌కు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్య‌త ప్ర‌జాప్ర‌తినిధుల‌దే. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యులు, స‌ర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్య‌ద‌ర్శి, సొసైటీ డైరెక్ట‌ర్, మార్కెట్ క‌మిటీ డైరెక్ట‌ర్, విఆర్ఓ, వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌తో క‌లిసి గ్రామ స్థాయిలో ఓ క‌మిటీ వేసుకోవాలి. ఈ క‌మిటీ స‌భ్యులంతా క‌లిసి, ధాన్యం కొనుగోలు చేస్తున్న ఐకెపి సంస్థ‌కు స‌హ‌క‌రించాలి. ధాన్యం మొత్తం ఎండిన త‌ర్వాతే రైతులు త‌మ ధాన్యాన్ని మార్కెట్‌కి ఇచ్చిన కూప‌న్ ప్ర‌కారం, నిర్ణీత తేదీనాడే తేవాలి. లాట‌రీ ప‌ద్ధ‌తి ద్వారా ఏ రైతు ఎప్పుడు తేవాల‌నేది నిర్ణ‌యించాలి’’ అని ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ గౌతం, స్థానిక ప్రజాప్ర‌తినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here