ప్రయాణీకుల నుంచి రైల్వేలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయంటూ కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఉన్న ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రద్దీని తట్టుకోడానికి ఎంతోకాలం నుంచి రైల్వేలు ఫెస్టివల్, హాలిడే ప్రత్యేక రైళ్లను నడుపుతూ వస్తోంది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రస్తుత పండుగల కాలంలో ఈ రైళ్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది పండుగ రైళ్లు నడుస్తున్న మార్గాలలో ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా వుంది.

రద్దీని తట్టుకొని ప్రయాణీకులను తరలించడానికి ఈ రైళ్లను కొనసాగించడం జరుగుతోంది. ఇటువంటి రైళ్లలో చార్జీలను ఇతర రైళ్లతో పోల్చి చూస్తే 2015 నుంచి కొద్దిగా ఎక్కువగా వసూలు చేయడం జరుగుతూ వస్తోంది. ఇది ఈ ఏడాది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రయాణీకుల రవాణాపై రైల్వేలు రాయితీలు కల్పిస్తున్నది. ప్రయాణీకుల రవాణా వల్ల వస్తున్న నష్టాన్ని రైల్వేలు భరిస్తున్నాయి. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వేలు కోవిడ్ సమయంలో కూడా సవాళ్ల మధ్య రైళ్లను నడపడం జరిగింది. తక్కువ మంది ప్రయాణిస్తున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని కొనసాగించడం జరుగుతున్నది.

ఇంతేకాకుండా రైళ్ళలో అతి తక్కువ ఛార్జీలతో ప్రయాణిస్తున్న వారి సంక్షేమానికి రైల్వేలు ప్రత్యేక శ్రద్ధ ఇస్తున్నాయి. కోవిడ్ సమయంలోకూడా వీరిపై ఎక్కువ భారం పడకుండా చూడడం జరిగింది. నడుస్తున్న అన్ని రైళ్లలో ఇతర తరగతులతో పాటు ఎక్కువ సంఖ్యలో 2 ఎస్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి, రిజర్వు చేసిన కేటగిరీలో అతి తక్కువ ఛార్జీలను కలిగి ఉన్నాయి. ప్రయాణీకులతో 40% మంది ప్రయాణికులు కోవిడ్‌కి ముందు, రిజర్వేషన్లు లేని సమయాలకంటే ఎక్కువ సౌకార్యాలతో 2ఎస్ తరగతిలో ప్రయాణించ కలుగుతున్నారు. రైల్వేల్లో అమలులో ఉన్న విధానం ప్రకారం 2 ఎస్ ప్రయాణికుల నుంచి ప్రత్యేక ఛార్జీలను కూడా అదనంగా 15 రూపాయలకంటె ఎక్కువగా వసూలు చేయడం లేదు.

రైళ్ల సంఖ్యను ఒక క్రమపద్ధతిలో భారతీయ రైల్వేలు పెంచుతూ వస్తున్నాయి. కోవిడ్ ముందు ఉన్న విధంగా ప్రయాణీకుల రైళ్ల సాధారణ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ముందు అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశ వ్యాపితంగా విధించిన లాక్ డౌన్ వల్ల రైల్వేలు 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేశాయి. వీటిని ఒక పద్దతిలో తిరిగి నడపడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి.

లాక్ డౌన్ విదించక ముందు ఉన్న పరిస్థితితో పోల్చి చూస్తే కోవిడ్ సమయంలో కూడా భారతీయ రైల్వే దాదాపు 60% మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపాయి ఈ ప్రత్యేక రైళ్లలో 77% సాధారణ రైళ్లలో వసూలు చేసే ఛార్జీలనే కలిగి ఉన్నాయి. ప్రతి రోజూ 250 ప్రత్యేక రైళ్లు ప్రత్యేక ఛార్జీలతో నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ రోజూ సగటున మొత్తం 1058 మెయిల్, ఎక్స్‌ప్రెస్, 4807 సబర్బన్ సర్వీసులు, 188 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. సాధారణ స్థాయికి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి ముందు రాష్ట్రాలలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులను రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవలసి ఉంటుంది.

ప్రయాణీకుల సంఖ్యా తక్కువగా ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనం కోసం అనేక రైళ్లను కొనసాగించడం జరుగుతున్నది. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచడం జరుగుతున్నది. పరిస్థితిని గమనిస్తున్న రైల్వేలు ప్రజల సంక్షేమం కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది.