అమరావతిపై ఫేక్ పోస్టుల రగడ

0
7 వీక్షకులు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి అనంతరం రాజధాని విషయంలో వైసీపీ సర్కారు కొత్త నిర్ణయం తీసుకోవడం, దానికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. అప్పటి నుంచీ నలుగుతూ, రాజకీయ దుమారాన్ని రేపుతూ వస్తున్న అమరావతి అంశం తాజాగా వ్యక్తులు, పార్టీల మధ్య రచ్చకు దారితీసింది.

అమరావతి రైతుల పేరిట ఉద్యమిస్తున్న జేఏసీకి ప్రతిపక్ష తెలుగుదేశం మద్దతు ఉందని భావిస్తున్న ప్రత్యర్ధులు ఆ పార్టీపై బురదజల్లే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఫేక్ పోస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కావాలంటూ ఉద్యమిస్తున్న వారి మనోభావాలను దెబ్బతీసేలా ఇటీవల క్రియేట్ చేసిన ‘మార్ఫింగ్’ మాయాజాలంపై జేఏసీ ప్రతినిధుల్లో ఒకరైన శ్రీనివాస్ ఎలా విరుచుకుపడ్డారో చూడండి. ఆయన కామెంట్స్‌ను విపక్ష తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా గ్రూప్‌ల్లో తనదైన శైలిలో చమత్కారం జోడించి పోస్టుచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here