సహాయం కోసం తండ్రి ఎదురుచూపు

1136

జగిత్యాల, మే 11 (న్యూస్‌టైమ్): జగిత్యాల మండలం రంగారావుపేట గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి మూడు రోజుల క్రితం తండ్రి అయ్యాడు. కానీ మధు దంపతులకు పుట్టిన బాబు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాబు పెద్ద పేగు ఆపరేషన్‌ చేయాల్సి ఉందని ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని మధు తెలిపాడు. దయచేసి దాతలు స్పందించి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దాతలు నేరుగా మధు మొబైల్ నెంబర్‌ 9949531024ను సంప్రదించవచ్చు.