ఎన్నికల తీర్పులో మహిళా ఓటర్లే కీలకం

215
  • జిల్లాలోని ఓటరు జాబితాలో వారిదే పైచేయి

కడప, మార్చి 29 (న్యూస్‌టైమ్): కడప జిల్లాలో ఎన్నికల తీర్పులో మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి. వారి ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలోని బద్వేలు మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. షెడ్యూలుకు ముందు జాబితాలో బద్వేలు కూడా ఎక్కువగా ఉన్నా ఆ తరువాత చేర్పులు, మార్పుల్లో బద్వేలులో మాత్రం వేయికి పైగా పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 22,04,964 ఓట్లు ఉండగా ఇందులో పురుషులు 10,87,117 మహిళా ఓటర్లు 11,17,547 మంది ఉన్నారు.

వీరు కాకుండా ట్రాన్స్‌జెండర్ల ఓట్లు300 ఉన్నాయి. పోలింగ్‌ రోజు మహిళలు ఓటింగ్‌ శాతంలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల తాయిలాలు, వారితో అనుకూలంగా ఓటు వేయించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు పార్టీలు ఇప్పుడు మహిళా ఓట్లను దక్కించుకునేందుకు వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.