మానవతావాది కోట సునీల్‌కుమార్ స్వామి

3268

నెల్లూరు, జులై 19 (న్యూస్‌టైమ్): నిరుపేదలకు, అభాగ్యులకు ఏ కష్టం వచ్చిన తాను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి అభయ హస్తం అందిస్తూ ఆదుకుంటున్న మానవతావాది, దయహృదయులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గూడూరు పట్టణానికి చెందిన కోట సునీల్‌కుమార్ స్వామి. ఈయన గూడూరు పట్టణ ప్రజానీకానికి కాకుండా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణం రాణిపేటలో నివాసం ఉంటున్న శంకర్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు.

శంకర్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వైద్య ఖర్చులు భరించడం శంకర్ తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితిలలో శంకర్ వైద్యం ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు గూడూరుకు చెందిన ఆశ్రయా ఫౌండేషన్‌తో పాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులను కలిసి శంకర్ దీనపరిస్థితిలను చెప్పడంతో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి శంకర్‌ను అదుకున్నారు.

కానీ, దురదృష్టవశాత్తు శంకర్ రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కోట సునీల్ కుమార్ స్వామి 10 వేలు రూపాయిలు ఆర్ధిక సాయాన్ని ఆశ్రయా ఫౌండేషన్ సభ్యులు పెటేటి చంద్రనిల్ చేతుల మీదుగా శంకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ శంకర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అనీ, అతని వైద్య ఖర్చులు కొరకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకున్నా దురదృష్టవశాత్తు శంకర్ మృతి చెందడం బాధకరంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రాధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు తదితరులు ఉన్నారు.