సీబీఎస్ఈ విద్యార్ధుల కోసం ‘ఫిట్ ఇండియా’

0
10 వీక్షకులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (న్యూస్‌టైమ్): భారత ప్రభుత్వపు అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యమం ‘ఫిట్ ఇండియా’ యాక్టివ్ డే కార్యక్రమం మళ్ళీ శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల శారీరక ఆరోగ్య సంరక్షణ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారి సంయుక్త భాగస్వామ్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శత్వంతో పిల్లలకు ప్రత్యక్ష ఆన్‌లైన్ తరగతులను నిర్వహించనుంది. ‘‘దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర మానవాభివృద్ధి శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్న 13868 సీబీఎస్ఈ పాఠశాలల్లో ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అందులో 11682 పాఠశాలలు ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాయి.

ఇపుడు ప్రారంభించనున్న ఈ క్రొత్త కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత ఆశయాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడటంతోపాటు ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది ’’ అని కేంద్ర కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘‘పిల్లలకు ఇళ్ళ వద్ద శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు, పిల్లలు ఆరోగ్యవంతంగా తయారుకావడానికి ఇంటి వద్ద నుండే నిపుణుల సలహాలతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో ఈ కొత్త కార్యక్రమం చాలా ఉపయుక్తమవుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి 3 మే 2020 వరకు పొడిగించిన లాక్డౌన్ రెండవ దశలో ప్రధాని పిలుపులో భాగంగా దేశ పౌరులందరూ తమ వ్యాధి నిరోధకతను పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్ ఇండియా, సీబీఎస్ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి మార్గదర్శకాలతో నిర్వహించనున్న శారీరక ఆరోగ్య పరిరక్షణ తరగతులు ఈ సారి పాఠశాల పిల్లల కోసం 15 ఏప్రిల్ 2020 ఉదయం 9:30 గంటల నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ప్రసారమవుతుంది. ఈ తరగతులు ఇతర పిల్లలతో పంచుకోవడానికి అనుకూలంగా యుట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ తరగతుల్లో ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు యోగా, పోషకాహారం, భావావేశ నియంత్రణ వంటి విషయాలపై ప్రఖ్యాత ఫిట్నెస్ నిపుణులు ఆలియా ఇమ్రాన్, పోషకాహార నిపుణులు పుజా మఖిజా, ఎమోషనల్ వెల్నెస్ నిపుణులు డాక్టర్ జితేంద్ర నాగపాల్, యోగా నిపుణులు హీనా బీమాని వంటి వివిధ విషయ నిపుణుల తరగతులు నిర్వహిస్తారు. సీబీఎస్ఈ, జీఒక్యూఐఐ, శిల్పాశెట్టి ఆప్ల ద్వారా సామాజిక మీడియాలో ఈ తరగతుల ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here