అడిక్షన్ అయిపోగల ఐదు ఆండ్రాయిడ్ ఆటలు!

4579

ముంబయి, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): ఉదయం లేచిన దగ్గర నుంచీ సెల్ ఫోన్లోనే సగం జీవితాన్ని గడిపేసే మనకి ఆండ్రాయిడ్ ఒక వరంగా దక్కింది అని చెప్పాలి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా బోర్ కొట్టినప్పుడల్లా రొటీన్ జీవితంలో నుంచి బయటకి మనల్ని తీసుకుని వచ్చే ఈ టాప్ ఐదు ఆండ్రాయిడ్ గేమ్స్ గురించీ తెలుసుకోండి. బింగ్ బాంగ్… ఆండ్రాయిడ్లో సరికొత్తగా వచ్చిన ఒక ఆసక్తికర ఆట. చాలా తేలికైనది కూడా. ఒక చుక్క (డాట్)ని తెరమీద మనకి గేమ్ వారు అందిస్తారు దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకూ వెనక్కూ వెళుతున్న దాన్ని అడ్డుకోవాలి.

ఆ చుక్కని నెమ్మదిగా కదపడం అనే విషయంలో ఈ ఆట మజా బయట పడుతుంది. ఖచ్చితంగా మనం స్లో చెయ్యాలని అనుకోము కానీ ఆట సాగుతున్న కొద్దీ ఆ డాట్ స్లో చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అలా తెలివిగా స్టేజీలు దాటుతూ చుక్కని మొత్తంగా ఆపకుండా కాసేపు ఫాస్ట్‌గా మరి కాసేపు స్లోగా జరుపుతూ ఉండడమే ఈ ఆట. బాడ్ లాండ్… అడ్వంచర్ ఆటలు సర్వసాధారణం అయితే కాకులు దూరని కారడవి టైపులో ఉండే ఈ బాడ్ లాండ్లో అడ్వంచర్ అంటే అది మీరు అనుకునేంత తేలిక కాదు సుమా. చూడడానికి పైకి చాలా సాధారణంగా కనిపించే ఈ అడవి ఆట సాగుతున్న రెండు నిమిషాలకి ఒక లాగా నాల్గవ నిమిషంలో మరింత భయంకరంగా మారుతుంది.

దీన్ని చిత్రీకరించిన వాడు ఎంతటి తెలివితో ఒక్కొక్క స్టేజీనీ చిత్రించాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అడ్వంచర్ ఆటల మీద ఆసక్తి ఉంటే కచ్చితంగా డౌన్ లోడ్ చేసి తీరండి. క్రాసీ రోడ్… ఈ ఆట చాలా క్యూట్‌గా ఉంటుంది. వివిధ రకాల బొమ్మలుగా మనం ఇందులో కనిపిస్తాం మనలని మనం రోడ్డు దాటించుకోవాల్సి ఉంటుంది. రోడ్లు మాత్రమే కాకుండా, నదులూ, రైల్వే కేనాల్స్, రైలు పట్టాలు, లాగ్ సహాయంతో వంకలు కూడా దాటడం ఇందులో ఛాలెంజ్. మనం ఎప్పుడైతే సరిగ్గా దాటలేక దేన్నైనా గుద్దుకుని చనిపోతామో ‘ఈ సారి పక్కా దాటేయగలం’ అన్న కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ మొదలు పెడతాం. ఈ ఆటకి వ్యసనపరం అయిపోవడానికి గల ముఖ్య కారణం ఇదే.

మాటి మాటికీ మళ్ళీ మళ్ళీ ప్లే చేసి మరీ ఆడే ఆట ఇది. ఆండ్రాయిడ్లో కరంటుకి సంబంధించి కూడా ఆటలూ పెట్టేసారు మరి, కరెంటు ఫ్లో అనే ఆట దీనికి సంబంధించినదే. చాలా అందంగా అదే సమయంలో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఎలెక్ట్రానిక్ సర్క్యూట్‌ని సరిజేసి టైల్స్‌ని అటూ ఇటూ తిప్పి సరిజేసి వాటి మీద మీటితే అవి సరిగ్గా కుదురుకుని లైటు బల్బులు వెలుగుతాయి. దాదాపు 100 లెవెల్స్ ఉన్న గేమ్ ఇప్పుడు మార్కెట్లో బాగా సేల్ అవుతోంది.

కట్ ద రోప్… ఇప్పటికే మీరు ఆడేసి ఉంటారు కానీ ఇది దీంట్లో రెండవ భాగం కట్ ద రోప్ 2 మొదటి దాంట్లోనే మనం చాలా ఆసక్తిగా ఆస్వాదించాం ఇందులో ఏకంగా ఇంకా ఎక్కువ స్టేజీలు పెట్టారు. తయారు చేసిన వాళ్ళు రెండు లైఫ్లు కూడా ఇస్తున్నారు. రోప్ చివర ఉన్న కాండీని రోప్‌ని తెంపి మన సొంతం చేసుకుని దాంతో వేరొక రోప్‌ని అందుకోవడమే ఈ ఆట. చిన్న సైజు సాహసంలా ఉంటుంది కూడా.