న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి 2,74,034 కోట్ల రూపాయల బలమైన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐ) ప్రవాహం వచ్చి చేరింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాల పట్ల విదేశీ పెట్టుబడిదారుల స్థిరమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. వినూత్నంగా రూపొందించిన ఉద్దీపన ప్యాకేజీల అమలు చేయడంతో వేగంగా బలమైన ఎఫ్‌పీఐ ప్రవాహాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల కోసం సౌలభ్యం, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, రెగ్యులేటర్లు ప్రధాన విధాన కార్యక్రమాలను చేపట్టాయి.

వీటిలో ఎఫ్‌పీఐ రెగ్యులేటరీ పాలన సరళీకరణ, హేతుబద్ధీకరణ, సెబీతో రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ కామన్ అప్లికేషన్ ఫారం (సీఎఎఫ్) కార్యాచరణ, పాన్ కేటాయింపు, బ్యాంక్, డీమాట్ ఖాతాలను తెరవడం మొదలైనవి ఉన్నాయి. భారతీయ కంపెనీలలో మొత్తం ఎఫ్‌పీఐ పెట్టుబడి పరిమితి 24% నుండి రంగాల పరిమితికి పెరగడం ప్రధాన సెక్యూరిటీల సూచికలలో భారతీయ సెక్యూరిటీల వాటా పెంచడానికి ఒక ఉత్ప్రేరకంగా ఉంది, తద్వారా నిష్క్రియాత్మకంగా, చురుకుగా ఉన్న భారీ ఈక్విటీ ప్రవాహాలను భారత మూలధన మార్కెట్లలోకి సమీకరించడం జరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనా 10 శాతంగా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, అనేక ప్రపంచ పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతుందని ఆ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.