కేంద్రాల సంఖ్య 25 స్థానాలకు పెంపు..

అందుబాటులోకి ‘రౌండ్ ద క్లాక్’ సేవలు..

న్యూఢిల్లీ, మే 16 (న్యూస్‌టైమ్): జాతీయ రాజధాని ఢిల్లీలో ఆయుష్-64, కబసుర కుడినిర్ ఉచిత పంపిణీ కేంద్రాలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ విస్తృతం చేసింది. ఇందులో భాగంగా సేవా భారతి సంస్థ ఇప్పటికే ఢిల్లీలోని 17 ప్రాంతాల్లో ఆయుష్-64 పంపిణీ ప్రారంభించింది. రెండు రోజుల వ్యవధిలో ఈ సంఖ్య 30 దాటవచ్చని భావిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా లేదా ప్రభుత్వ, ఎన్జీఓ ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో నివసిస్తున్న కొవిడ్-19 రోగులు ఆయుష్ మంత్రిత్వ శాఖ చొరవ ద్వారా లబ్ది పొందుతున్నారు. మరోవైపు, ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం 20కి పైగా రాష్ట్రాలకు చేరుకుంది. ఇంట్రా స్టేట్ రీచ్ నిరంతర ప్రాతిపదికన విస్తరిస్తోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద రౌండ్ ద క్లాక్ (24×7) ఉచిత పంపిణీ కౌంటర్‌ను ప్రారంభించింది. మరో రెండు ఆయుష్ సంస్థలు, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి, సెక్టార్ -19, రోహిణి, డాక్టర్ డిపి రాస్తోగి సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సెక్టార్-24, నోయిడా, ఆసుపత్రిలో లక్షణాలు లేని, తేలికపాటి మితమైన లక్షణాలు కలిగిన కొవిడ్-19 రోగుకు ఆయుష్-64 పంపిణీ చేయడం ప్రారంభించింది. గత శనివారం ఢిల్లీలోని ఏడు కేంద్రాల ద్వారా ఈ మందుల పంపిణీని మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే. సేవా భారతి ప్రారంభించిన 17 పంపిణీ కేంద్రాలు షాహదారా, గాంధీనగర్, ఇంద్రప్రస్థ, హిమ్మత్‌పురి (మయూర్ విహార్ ఫేజ్-1), కాల్‌కాజీ, బదర్‌పూర్, కరవాల్ నగర్, బ్రహ్మపురి, నంద్ నగ్రి (2), రోహ్తాస్ నగర్, తిలకాపూర్‌, రోహిణి, కంజావ్లా, నరేలా, బురాడిలో ఉన్నాయి. ఈ కేంద్రాలు వారానికి ఏడు రోజులు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 వరకు పనిచేస్తాయి.

ఇవే కాకుండా ఆయుష్ భవన్, బి-బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్ రిసెప్షన్ వద్ద సేల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆయుష్-64, ఆయురాక్ష కిట్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. రోగులు లేదా వారి ప్రతినిధులు రోగి ఆర్టీ-పీసీఆర్ పాజిటివ్ రిపోర్ట్ లేదా రాపిడ్ యాంటిజెన్ రిపోర్ట్ (ఆర్‌ఎటి) లేదా హెచ్‌ఆర్‌సిటి చెస్ట్ రిపోర్ట్, ఆధార్ కార్డ్ హార్డ్ లేదా సాఫ్ట్‌ కాపీలు చూపించి ఉచిత ఆయుష్ 64 టాబ్లెట్లను పొందవచ్చు. ఆయుష్-64 అనేది పాలీ హెర్బల్ ఫార్ములా. ఇది లక్షణరహిత, తేలికపాటి, మితమైన లక్షణాలున్న కొవిడ్-19 చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం, యోగా ఆధారంగా నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో ఆయుష్-64 సిఫారసు చేయడం జరిగింది. ఇది ఐసిఎంఆర్ కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై నేషనల్ టాస్క్‌ఫోర్స్, హోం ఐసోలేషన్‌లోని కోవిడ్ -19 రోగులకు ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు మార్గదర్శకాలను పరిశీలించింది. దీనిని కీలకమైన మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్ తరువాత కోవిడ్-19 రోగులకు ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా తయారు చేశారు. ఐసిఎంఆర్ మాజీ డిజి డాక్టర్ వి.ఎం.కటోచ్ అధ్యక్షతన ఆయుష్-సిఎస్ఐఆర్ జాయింట్ మానిటరింగ్ కమిటీ మంత్రిత్వ శాఖ క్లినికల్ ట్రయల్ పర్యవేక్షించింది.