మూకీ నుంచి టాకీ వరకూ…

0
10 వీక్షకులు
  • తొలితరం తమిళ దర్శక, నిర్మాత సుబ్రమణ్యం ప్రస్థానం

చెన్నై, ఏప్రిల్ 20 (న్యూస్‌టైమ్): కృష్ణస్వామి సుబ్రమణ్యం… తొలితరానికి చెందిన ప్రముఖ తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు. 1904 ఏప్రిల్ 20న తంజావూరు జిల్లా పాపనాశంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ పేరుమోసిన న్యాయవాది. సుబ్రమణ్యం కూడా తండ్రిబాటలో న్యాయశాస్త్రం చదివి న్యాయవాది అయ్యాడు. లా ప్రాక్టీసు కంటే సినిమాలపై మక్కువ ఏర్పరచుకున్న సుబ్రమణ్యం మద్రాసులో మూకీ సినిమా దర్శకుడు రాజా సందౌ వద్ద పనిచేశాడు. ఈయన ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం తండ్రి.

సుబ్రమణ్యం మద్రాసులో చలనచిత్ర పరిశ్రమ స్తాపనలో ప్రముఖపాత్ర వహించాడు. సుబ్రమణ్యం పేయుమ్ పెన్నుమ్ వంటి రాజా సందౌ మూకీ చిత్రాలలో ఆరిస్టుగా, నిర్మాతగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ఆర్.ఎమ్.అలగప్ప చెట్టియారుతో కలిసి మీనాక్షీ సినీటోన్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకుడిగా తొలిచిత్రమైన ‘పావలక్కోడి’ తీశాడు. ఈ సినిమాలో ఎం.కె.త్యాగరాజ భాగవతార్ సినీరంగానికి పరిచయమయ్యాడు. సమాజంలో ప్రచలితమైన కుల వ్యవస్థను విమర్శిస్తూ బాలయోగిని వంటి రాజకీయ చిత్రాన్ని తీసి, విభిన్నమైన దర్శకుడుగా పేరొందాడు. 1938లో స్త్రీల సమస్యలను ఎత్తి చూపుతూ సేవాసదనం సినిమాను, అంటరానితనాన్ని విమర్శిస్తూ భక్త చేట, యుద్ధ ప్రయత్నాలను అద్దంపడుతూ మానసంరక్షణం సినిమాలు తీశాడు.

ఈయన సినిమాలలో ప్రసిద్ధమైనది 1939లో విడుదలైన ‘త్యాగభూమి’. కల్కి కృష్ణమూర్తి నవల త్యాగభూమి ఆధారితంగా నిర్మితమైన ఈ జాతీయవాద సంస్కరణాత్మక చిత్రాన్ని అప్పట్లో బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఈయన 1941లో ప్రముఖ నాటకకర్త ఎన్.పి.చెల్లప్పన్ రాసిన ప్రహ్లాద అనే మళయాళ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here