‘ఫల’వంతమైన ఆరోగ్యం!

0
25 వీక్షకులు

న్యూఢిల్లీ, మే 24 (న్యూస్‌టైమ్): పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఎక్కువగా పండ్లు తినమని వైద్యులు, నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే, ఇందులో ఫలానా ఫలం తీసుకుంటేనే ఆరోగ్యమనే నియమమేమీ లేదు. ఏ పండు తిన్నా ఎంతోకొంత మేలు ఉంటుంది. కానీ, చక్కెర (మధుమేహం) వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం తీసుకునే పండ్ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. మరీ ముఖ్యంగా ఏ ఫలంలో ఎంత చక్కెర శాతం ఉందో తెలుసుకోవడం కీలకం.

మామిడి, యాపిల్‌, నారింజ, సపోటా, అరటి, స్టాబెర్రీ ఇలా ఏ పండును తీసుకున్నా ఆరోగ్యకరమే. అన్నింట్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. వీటిలో సహజసిద్దమైన విటమిన్లు, మినరల్స్‌, ఫైటో కెమికల్స్‌ ఉంటాయి.

శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్‌ టాబ్లెట్లు వాడడం కన్నా పండ్లను తింటే సహజసిద్ధమైన విటమిన్లు లభిస్తాయి. ప్రతిరోజూ ఐదు పండ్ల ముక్కలను తినడం వల్ల సంపూర్ణారోగ్యంగా ఉంటారు. అయితే పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం. పండ్లు ఎపుడు తినాలి? సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు.

పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల ఇది శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఈ సమయంలో తీసుకొనే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాంశాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నిధానంగా పెంచడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ వ్యాయం చేస్తున్నట్లైతే పండ్లు ఫర్ ఫెక్ట్ స్నాక్‌గా తీసుకోవచ్చు. స్నాక్ అనే ఈ పండ్లను వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది.

పండ్లు మన శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ను నిర్వహిస్తుంది, కానీ ఇది కడుపు ఫుల్‌గా లేదా ఉబ్బరంగా అనిపించదు. శరీరం కూడా ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ద చేసుకుంటుంది. వ్యాయామం చేయడానికి బాడీ సెల్స్‌కు ఇన్సులిన్ స్థాయిలను పంపిస్తుంది. భోజనానికి ఒక గంట ముందు పండ్లు తీసుకోవడం చాలా మంచి పద్దతి. అలాగే భోజనం చేసిన రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది. ఇలా తీసుకోవడం వల్ల విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్లు పూర్తిగా శరీరంలోని వ్యాప్తి చెందుతాయి. పండ్లను ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అదే విధంగా భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకోవడం వల్ల, శరీరంలో ఫ్రక్టోజ్ ద్వారా శోషణ నెమ్మదిగా ఉంటుంది.

మిగిలిన ఫ్రక్టోజ్ జీర్ణవ్యవస్థలో ఉండి ఆర్గానిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది, కడుపు ఉబ్బరం, అతిసారానికి దారితీస్తుంది. పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగుతో కలుపుకొని తినవచ్చు. పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి.

వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు. మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్‌తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.

పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది. మనకు ఏ సీజన్‌లో అయినా వివిధ రకాల పండ్లు లభిస్తాయి. కొన్ని పండ్లు మాత్రం సీజన్‌ను బట్టే లభిస్తాయి. అలాంటి పండ్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

ప్రతి సీజన్‌లో దొరికే పండ్లను తినడం, జూస్‌లా తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాదు అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి అందుకే తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వడం తప్పనిసరి. రక్తాన్ని వృద్ధి చేసే గుణం దానిమ్మ పండులో ఎంతో ఉంది.

తద్వారా రక్తహీనత నుంచి సునాయనంగా బయటపడోచ్చు. రోజువారీగా దాన్నిమ్మ పండును తినడం వల్ల వడదెబ్బ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. దానిమ్మలో 368 మిల్లీ గ్రాముల పొటాషియం, 102 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 34 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 25 మిల్లీ గ్రాముల కాల్షియం, విటమిన్-సీ, ఈ, కే, బీ1, బీ2 దానిమ్మలో మెండుగా లభిస్తాయి. అందుకే ఏ కాలంలోనైనా దానిమ్మ తినవచ్చు. కానీ, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారు ఏ పండ్లు తినొచ్చు? చక్కెర స్థాయి ఏ పండ్లలో ఎంతుంటుంది? ఆరోగ్యం కోసం ఎవరు ఏ పండైనా తినొచ్చా? ఇటువంటి విషయాల్లో ప్రతిఒక్కరూ తికమకపడుతుంటారు. ఏ పండ్లలో ఎంత శాతం చక్కెర ఉందో తెలుసుకుందాం.

యాపిల్‌:

యాపిల్ పండులోని పెక్టిన్ అనే రసాయనం పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. మానవ శరీరంలోని పేగులు ఆరోగ్యంగా ఉండేలా బ్యాక్టీరియా సంఖ్యను గణనీయంగా ఈ పండు వృద్ధి చేస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్ తినడం ద్వారా సర్వసాధారణంగా వైద్యుడితో పని ఉండదని చెబుతుంటారు.

శరీరంలో బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెంది కొన్ని రకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సహాయకారిగా ఈ పండు పని చేస్తుంది. పేగులకు హాని చేసే సూక్ష్మక్రిముల నుంచి ముఖ్యంగా ప్రస్తుతం ఎండాకాలంలో ఈ పండు తినడం వల్ల శరీరానికి తగిన విధంగా శక్తి వస్తుంది. వీటి ధర ఎక్కువగానే ఉన్నా వీలైనంత వరకూ ఈ పండు తినడం అవసరం. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరముండదని చెబుతుంటారు.

అవును అది నిజమే. యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది.

100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల విటమిన్ సి ద్వారా పొందే యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇది మనకు ఏ సీజన్‌లోనైనా దొరుకుతుంది. యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. యాపిల్‌ అత్యున్నత స్థాయి పోషకాహారం.

దీనిలో ఖని జాలు, విటమిన్లు విస్తృతంగా ఉంటాయి. పండులోల చక్కె రస్థాయిని అనుసరించి దీని పోషక విలువలు ఆధారపడి వుంటాయి. శరీరంలో జరిగే రసాయన, శారీరక మార్పు లవల్ల జీవక్రియ నిరంతరం ఎదుగుదల, పనితీరుకు అవరోధం కలుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితిని అధిగ మించేందుకు యాపిల్‌ ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి.

రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది. యాపిల్‌ లివర్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా కాపాడుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది.

ట్రిటర్‌పెనాయిడ్స్‌గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. రోజుకు ఒక యాపిల్‌ తినే మహిళల్లో 28 శాతం టైప్‌ 2 మధుమేహం రాదట. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించడమే అందుకు కారణం. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఉదయం, రాత్రి రెండు పావు ముక్కలు మొత్తం ఓ అరయాపిల్‌ తినగల్గితే టైప్‌-2 డయాబెటిస్‌లో అద్భుత ఫలితాలు ఉన్నట్లు రీసెర్చ్‌ ద్వారా రుజువైంది. అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది.

యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకోకుండా యాపిల్‌లోని ఫైబర్‌ సాయపడుతుంది.

అనేక సమస్యలకు మూలమైన అధిక బరువును తగ్గించడానికి యాపిల్‌ మంచి పరిష్కారం. కేలరీలు తక్కువగా ఉండి కడుపునింపడంలో దీనిదే పైచేయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడంలో ఈ యాపిల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి యాపిల్ మీ రెగ్యులర్ డైయట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి.

దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది. యాపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది.

యాపిల్‌ తినడంవల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. అది పళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, పళ్ల సందుల్లో బ్యాక్టీరియా సెటిలైపోకుండానూ చేస్తుంది. అంటే పళ్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. రెగ్యులర్‌గా యాపిల్ జ్యూస్ తాగినా పండు తిన్నా కిడ్నీలలో క్యాల్షియం యాగ్జలేట్ రాళ్ళు తయారు కావు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు యాపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది.

వయసుతో వచ్చే మతిమరుపు, ఆల్జీమర్స్‌ను తగ్గించే గుణం యాపిల్‌కు ఉంది. కారణం, యాపిల్‌ మెదడుకు శక్తినిస్తుంది. ప్రతి రోజూ వ్యాయామంతో పాటు ఒక యాపిల్ తినడం వల్ల శరీరానికి బలాన్నిస్తుంది. ఫ్రెంచి పరిశోధనల ప్రకారం యాపిల్‌లో ఉండే ఫ్లోరిడ్జెన్‌ మహిళలకొచ్చే మెనోపాజ్‌ దశలో ఎముకలు బలహీనమవడాన్ని తగ్గిస్తాయి. మెనోపాజ్‌ దశలో మహిళలలో సంభవించే ఎముకలకు సంబంధించిన ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఎర్రటి యాపిల్ పండులోనున్న ఫ్లేవోనాయిడ్ తత్వం వలన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది.

దీంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యంగాను ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే యాపిల్‌ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. యాపిల్ పండ్లలో శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు సమపాళ్ళల్లో ఉంటాయి. అలాగే క్యాలరీలను తగ్గిస్తుంది. శరీరంలోని క్యాలరీలను తగ్గించడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి.

కనుక రోజుకో యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును తగ్గించుకోవచ్చంటున్నారు. బీపీను తగ్గించుకునేందుకు కొందరు గ్రీన్ టీ తాగడం, బ్లూ బెర్రీస్ తినడం వల్ల, రోజుకో యాపిల్ తినడం ద్వారా ఎటువంటి హానీ లేకుండా బీపీను తగ్గించుకోవచ్చంటున్నారు. గర్భ సమయంలో ఆరోగ్యం పదిలంగా ఉండటానికి, పుట్టే బిడ్డ ఆరోగ్యానికీ యాపిల్‌ మంచి మార్గం. ఆస్తమాతో బాధపడేవారు విడవకుండా రోజూ ఓ యాపిల్‌ తినగల్గితే వ్యాధి నియత్రంణలో ఉంటుంది.

పొడి దగ్గులో తియ్యని యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు పావు కిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్లనొప్పుల్లో యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది.

యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్, గౌట్‌వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్‌ని తటస్థపరిచి నొప్పులను దూరంచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. యాపిల్స్‌ను ఉడికించి జెల్లిలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది. హెయిర్‌ గ్రోత్‌ కూడా బాగుంటుంది.

సూర్యకాంతి యొక్క రేడియేషన్‌ ప్రభావం నుండి మన చర్మానికి రక్షణ ఇస్తుందని రుజువైంది. ఎండలోకి వెళ్ళకతప్పని పరిస్థితిలో ఓ యాపిల్‌ తిన్నారంటే ఎండ కారణంగా చర్మానికి ఎటువంటి హానీ జరగదు. ఇక, 100 మిల్లీలీటర్ల యాపిల్‌ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.

దానిమ్మ:

‘ఏక్ ఫల్ సౌ భీమారియ’ దానిమ్మ పండుకు హిందీలో ఉన్న సామెత. అంటే అనేక రోగాలకు దానిమ్మ సమాధానం అని అర్ధం. పండుగా కన్నా ఔషధ రూపంలోనే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. దానిమ్మ పండు మ‌న‌కు ఏ సీజ‌న్‌లో అయినా దొరుకుతుంది. చ‌క్కని రంగులో తిన‌డానికి రుచిక‌రంగా ఉండే ఈ పండు ద్వారా మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. పొటాషియం, ఫైబ‌ర్‌, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం వంటి ఎన్నో పోష‌కాలు దానిమ్మ పండ్ల‌లో ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే రోజుకో దానిమ్మ పండును ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి వంటి పోష‌కాలు దానిమ్మ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్లు రావు. ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌లు రాకుండా ఉంటాయి. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. సంతానం లేని వారికి దానిమ్మ పండును ఒక వ‌రంగా చెప్ప‌వ‌చ్చు.

ఎందుకంటే దంప‌తులు ఇద్ద‌రూ రోజూ దానిమ్మ పండును తింటే వారి శృంగార స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, ఆ శ‌క్తి కూడా పెరుగుతుంది. స్త్రీల‌లో రుతుక్ర‌మం స‌రిగ్గా అవుతుంది. త‌ద్వారా సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి.

ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. బీపీ త‌గ్గుతుంది. ర‌క్తం పెరుగుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జ‌రుగుతుంది. దంత స‌మ‌స్య‌లు ఉండ‌వు. చిగుళ్ల వాపు, నొప్పి త‌గ్గుతాయి.

నోటి దుర్వాస‌న పోతుంది. డ‌యేరియా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇక, ప్రతి 100 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్‌లో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.

ద్రాక్ష:

ఏ సీజన్‌లోనైనా ఒంటిని కూల్‌గా చేసే ద్రాక్ష పండ్ల వెనుక మరెన్నో లాభాలున్నాయి. సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బుల నివారణలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే చక్కని రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ద్రాక్షలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది.

కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు, ఫ్లేవ‌నాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయస్సు మీద ప‌డ‌డం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష తొక్క‌లో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది.

తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ద్రాక్షల్లో కర్బన ఆమ్లాలు, సెల్యులోజ్ లాంటి చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మంచి లాగ్జేటివ్స్‌గా పనిచేస్తాయి. కాబట్టి మలబద్దకంతో బాధపడుతున్నవారికి ద్రాక్షపండ్లు మంచి మందుగా పనిచేస్తాయి. అజీర్తి నుంచి బయటపడేయడానికి సహాయపడతాయి.

ద్రాక్షల్లో ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల రక్తవృద్ధి జరిగి అలసట, నీరసం లాంటివన్నీ మటుమాయం అవుతాయి. అయితే, ద్రాక్షపండ్లను పండుగా తింటేనే మేలు. జ్యూస్ చేసుకుంటే ఇనుము మోతాదు తగ్గిపోతుంది. కానీ శరీరం శక్తిని మాత్రం పుంజుకుంటుంది. ద్రాక్షల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచగల సత్తాయే కాదు కొన్ని రకాల బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో కూడా ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి.

ముఖ్యంగా పోలియో వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్‌ల విషయంలో ఇవి మరింత శక్తిమంతమైనవి. ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. క్షీరగ్రంథుల కణితుల పెరుగుదలపై దీని ప్రభావాన్ని ఎలుకలపై చేసిన ప్రయోగాలు నిర్ధారించాయి. ద్రాక్షరసం ఇచ్చిన తరువాత ఎలుకల క్షీరగ్రంథుల క్యాన్సర్ కణాలు గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో గమనించారు.

ద్రాక్షల్లోని రిస్‌వెరటాల్ చూపించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్‌వెరటాల్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంథ్రోసయనిన్లు యాంటీ ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది.

ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి. వయస్సు పెరిగినకొద్దీ దాడిచేసే వ్యాధుల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. దీనివల్ల నెమ్మ‌దిగా దృష్టి సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ప్రతిరోజూ ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్ డీజనరేషన్ అవకాశం 36 శాతం తగ్గిపోతుంది. ద్రాక్షల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఫ్రీరాడికల్స్ దాడిని ఎదుర్కోవడంలో ఇవి అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల క్యాన్సర్లు, గుండె, రక్తనాళాల సమస్యలు, వయస్సుతో పాటు వచ్చిపడే ఇతరత్రా జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తాయి. పెద్దవారిలో శుక్లాలు సర్వసాధారణం.

కానీ రోజూ ద్రాక్షలు తీసుకుంటే కంటిలో శుక్లాలు ఏర్పడే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారిలో అమైలాయిడల్ బీటా పెప్టైడ్స్ మోతాదును తగ్గిస్తాయి. ద్రాక్షల్లో ఉండే రిస్‌వెరటాల్ అనే పాలీఫినాల్ ఇందుకు తోడ్పడుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. న్యూరోజనరేటివ్ వ్యాధుల నివారణకు ద్రాక్షలు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎన్నోరకాల జబ్బుల నివారణలో ద్రాక్షపండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇంట్లోనే చేసుకునే చిట్కావైద్యాలకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. బాగా పండిన ద్రాక్ష పండు పార్శ్వ‌పు తలనొప్పి (మైగ్రేన్)కి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే పరగడపున నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండుద్రాక్షల్లో రెయిసిన్స్ ఉంటాయి.

ఇవి మంచి పోషకపదార్థాలు. మలబద్దకం, అసిడోసిస్, రక్తహీనత, జ్వరాలు, లైంగిక సమస్యలను తగ్గించడంలో, నేత్ర ఆరోగ్య పరిరక్షణలో ఇవి సహకరిస్తాయి. ద్రాక్ష రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏ సీజన్‌లోనైన దొరికే ఈ ద్రాక్ష శరీరానికి అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలను అందిస్తుంది. ఇక చక్కెర విషయానికి వస్తే 100 మిల్లీలీటర్ల ద్రాక్ష జ్యూస్‌లో 14.2 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఆరెంజ్‌:

చూడటానికి కళ్లకు కలర్ ఫుల్‌గా ఆకర్షించడమే కాకుండా రుచికరంగానూ ఉండే కమలాపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆరెంజ్ పండ్లు మనకు చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ కాలంలో వీటిని తింటే మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

ఆరెంజ్ పండ్లలో ఉండే విటమిన్ సితోపాటు ఎన్నో కీలకమైన పోషకాలు మనకు లభిస్తాయి. వీటి వల్ల ఈ కాలంలో మనకు వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే నిత్యం ఒక గ్లాస్ మోతాదులో ఆరెంజ్ జ్యూస్‌ను తాగితే ఎన్నో ప్రయోజనాలు, ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఆరెంజ్ జ్యూస్‌ను రోజూ తాగితే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.

దీంతో హార్ట్ స్ట్రోక్స్ రావు. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో పుష్కలంగా ఉండే మెగ్నిషియం హైబీపీని తగ్గిస్తుంది. బీపీని నార్మల్ రేంజ్‌కు తీసుకొస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలద్దకం, అజీర్ణం ఉండవు. అల్సర్లు తగ్గుతాయి. ఆరెంజ్ జ్యూస్‌ను రోజూ తాగితే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు ఉండవు.

మౌత్, కోలన్, బ్రెస్ట్, లంగ్ క్యానర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు ఆరెంజ్ జ్యూస్‌లో ఉంటాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే అధిక బరువు తగ్గుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. 100 మిల్లీలీటర్ల ఆరెంజ్‌ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది.

అవకాడో:

వయస్సు మీద పడుతున్నప్పటికీ శరీరాన్ని ఇంకా యవ్వనంగానే ఉంచేందుకు ఇవి దోహదపడతాయి. వీటిలో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. శరీరానికి ఇవి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. వీటిల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సంరక్షణకు ఉపయోగపడితే, విటమిన్ సీ, ఈలు వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. దీంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరునే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

అవకాడోను ఆరునెలల పాటు క్రమం తప్పకుండా తింటే వృద్ధుల కళ్లలో ల్యూటిన్ ప్రమాణాలు పెరుగుతాయి. అంతేకాదు, ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అవకాడో ప్రతిరోజు తినడం వల్ల వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

ఆరునెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అవకాడోను తింటే వృద్ధుల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ల్యుటిన్ పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పెరిగిన ల్యుటిన్ మెదడు, కళ్లలోకి చేరుతుంది.

ల్యుటిన్ యాంటీ ఇన్‌ప్లమేటరీ ఏజెంటు మాత్రమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించవచ్చు. అవకాడో తినని వారిలో కాగ్నిటివ్ సామర్థ్యం తక్కువగా పెరగడాన్ని పరిశోధకులు గమనించారు.

అవకాడో మెదడు ఆరోగ్యాన్నే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సప్లిమెంట్స్ తినే వారితో పోలిస్తే తాజా అవకాడో తిన్న వాళ్ల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు రెట్టింపుగా ఉంటాయి.

వృద్ధుల కంటిని, మెదడుని ఆరోగ్యంగా ఉంచేందుకు దివ్యౌషధంగా సహాయ పడుతుంది. ఇంకెందుకు, ఆలస్యం బాగా తిని ఆరోగ్యంగా ఉండండి. ఇందులో చక్కెర స్థాయి అతి తక్కువగా ఉంటుంది. ఒక అవకాడో పండులో కేవలం 1 గ్రాము చక్కెరే ఉంటుంది.

మామిడి:

పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండిన మామిడైనా సరే ఔషధ గుణాలు మాత్రం తగ్గవు. మామిడితో తయారు చేసే చూర్ణంతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

వేస‌విలో మ‌నకు అధికంగా ల‌భించే పండ్ల‌లో మామిడి పండు కూడా ఒక‌టి. దీన్ని ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. అమోఘ‌మైన రుచిని మామిడి పండ్లు క‌లిగి ఉంటాయి. వీటిని ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా తీసుకోవాలి. దాంతో మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మామిడి పండులో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ ఎ, సి, బి6, ఇ ల‌తో పాటు కాపర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి.

ఇవి మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణను అందిస్తాయి. మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధిక ర‌క్త‌పోటును తగ్గిస్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. ఈ పండులోని విట‌మిన్ సి, ఫైబ‌ర్ శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. చిగుళ్ల ఇన్‌ఫెక్ష‌న్‌, ర‌క్తం కార‌డం, దంతాల నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మామిడి పండ్ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. దీంతో నోట్లోని బాక్టీరియా న‌శించ‌డ‌మే కాదు, ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లతో బాధ‌పడే వారు మామిడి పండ్ల‌ను తింటే గుణం క‌నిపిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ఉండ‌వు.

మామిడి పండ్ల‌లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న వారికి మేలు చేస్తుంది. మామిడి పండ్లలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్ధం స‌మృద్ధిగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం బ‌లోపేతం అవుతుంది.

మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. పచ్చి మామిడి తినడం వలన ఉపిరితిత్తులు శుభ్ర‌పడుతాయి. మామిడి పండును తినడం ద్వారా చర్మం కాంతిని సంత‌రించుకుంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.

మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

చర్మానికి మృదుత్వం చేకూరుతుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్‌ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడితే ఇంకా మంచి ఫ‌లితాలు ఉంటాయి. మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండాల‌లోని రాళ్ళు కరిగిపోయి, ఇకపై రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.

ఇలా ప్రతిరోజూ సేవిస్తుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ పండులో చక్కెర శాతం మాత్రం ఇందులో ఎక్కువగానే ఉంటుంది. ఒక చిన్న సైజు మేంగోలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది.

చెర్రీ:

ఎరుపు రంగులో ఆక‌ర్ష‌ణీయంగా ఉండి చూడగానో నోట్లో వేసుకోవాల‌నిపించే చెర్రీ పండ్లంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. చెర్రీ పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిష‌యం, పొటాషియం, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ప‌లు అనారోగ్య సమస్య‌లు రాకుండా చూస్తాయి. నొప్పులు, వాపుల‌ను నివారించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు చెర్రీ పండ్ల‌లో ఉన్నాయి. వీటిని తింటే ఒళ్లు నొప్పులు, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి. చెర్రీ పండ్ల‌లో మెల‌టోనిన్ అనే ర‌సాయ‌నం పుష్క‌లంగా ఉంటుంది.

దీని వ‌ల్ల మ‌న‌కు నిద్ర త్వ‌ర‌గా ప‌డుతుంది. నిద్ర సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చెర్రీ పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. కీళ్లలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వ‌ల్ల వ‌చ్చే గౌట్ స‌మ‌స్య నుంచి చెర్రీ పండ్లు బ‌య‌ట ప‌డేస్తాయి.

కీళ్ల‌లో చేరే యూరిక్ యాసిడ్‌ను బ‌య‌టికి పంపిస్తాయి. చెర్రీ పండ్ల‌లో ఆంథోస‌య‌నిన్స్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి పొట్ట ద‌గ్గ‌ర అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. ఫైబ‌ర్‌, థ‌యామిన్‌, రైబో ఫ్లేవిన్‌, విట‌మిన్ బి6 వంటి పోష‌కాలు చెర్రీ పండ్ల‌లో స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను గాడిలో పెడ‌తాయి.

దీంతో కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. పొటాషియం అధికంగా ఉన్న కార‌ణంగా చెర్రీ పండ్లు గుండె సంబంధ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారికి చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. బీపీని త‌గ్గిస్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త‌ల‌ను పెంచే మెమొరీ బూస్టింగ్ గుణాలు చెర్రీ పండ్ల‌లో ఉన్నాయి. ఇవి అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయ‌ని యాంటీ ఏజింగ్ గుణాలు వీటిలో ఉన్నాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌ల‌ను ఇవి త‌గ్గిస్తాయి. చెర్రీ పండ్ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి.

గ్యాస్‌, అసిడిటీ ఉండ‌వు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. నేరేడు జాతికి చెందిన ఈ పళ్లలో మంచి పోషకాలున్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ కెమికల్‌ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఒక కప్పుడు చెర్రీస్‌లో 19 గ్రామలు చక్కెర ఉంటుంది.

స్ట్రాబెర్రీ:

కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలని తెలుసు. గర్భవతులకు పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మేలు కలిగిస్తుందని తెలుసు. అలాంటి మేళ్లు ఎన్నో కలగలసి ఒక్క స్ట్రాబెర్రీ పండ్లలోనే ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తెలిసింది. వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను సాధారణంగా ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాలిక్యులార్ డీజనరేషన్ అంటుంటారు.

కానీ ఇలా వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గే సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లలో ఉండే విటమిన్-సి వల్ల చూపు తగ్గే సమస్య నివారితమవుతుంది. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఈ సమస్యను దాదాపు 36 శాతానికి పైగా నివారించవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు. స్ట్రాబెర్రీలలో ఉండే యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఇదే విషయాన్ని ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురించారు. స్ట్రాబెర్రీలు తినేవారిలో ఊపిరితిత్తులు, ఈసోఫేగస్, రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనంలో తెలిసింది.

గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. దాంతో అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం దీని నుంచి దూరంగా ఉండాలి. స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతుంది.

యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. ఇక, చక్కెర శాతం విషయానికి వస్తే ఒక కప్పుడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.

జామ:

జామపండు తింటే ఇక ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. ఇది ఎవరో చెబుతున్నది కాదు, స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు వారు. మన దగ్గర విరివిగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే జామకాయ అంటే మనము చిన్నచూపు చూస్తుంటాం. తినడానికి అనాసక్తి చూపుతుంటాం. కానీ జామలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని, ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేది జామకాయల సీజన్. విరివిగా మనకు అందుబాటులో ఉండనున్నాయి. ఇష్టంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మరి.

ఇది జామకాయల సీజన్. మన ప్రాంతంలో ఇంటి ఆవరణలో, పంట చేనుల్లో , రోడ్ల వెంట ఎక్కువగా జామచెట్లు చూస్తుంటాం. జామ చెట్లు ఎక్కువగా అందుబాటులో ఉండడంతో సహజంగానే జామ కాయ అంటే మనం చిన్నచూపు చూస్తూ వాటిని తినేందుకు అనాసక్తి కనబరుస్తుంటాం. కానీ, జామ తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. విటమిన్-ఏ,సీ, ఈ పుష్కలంగా ఉన్న జామపండులో పోషక విలువలు మెండుగా ఉన్నాయి. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమానమని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని కాయల్లో లోపల గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నింటిలో గుజ్జు లేత గులాబీ వర్ణంలో ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జామపండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దోర జామపండును సానరాయి మీద గంధం చేసి నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ (పార్శపు నొప్పి)తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. అలాగే జామపండ్లను చిన్న సైజు ముక్కలుగా కోసి తాగేనీటిలో మూడు గంటల పాటు నానబెట్టి, ఆ నీటిని తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో ప్రస్తుతం చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకాన్ని వ్యాధుల కుప్పగా చెప్పవచ్చు. మలబద్ధకాన్ని నివారించక పోతే శరీరం వ్యాధులమయంగా మారుతుంది. దీనికి పరిష్కారం జామ అని చెప్పుకోవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

అంటే అరటి పండు కన్నా 63శాతం ఎక్కువ. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం కలుపుకొని తింటే తరుచూ వేధించే మలకబద్ధకం సమస్య దూరమవుతుంది. అతిసార, జిగట విరేచనాలు, గర్భిణుల్లో వాంతులు ఉన్నప్పుడు జామకాయ కషాయం గానీ, మజ్జిగలో కలుపుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి.

ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం (రక్తం కారడం) ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పుడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. ఎన్నో పోషక విలువలు ఉన్న జామకాయ నిజంగా దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఆహారం తీసుకున్నాక జామకాయ లేక పండిన జామను తింటే తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. జామకాయలో అధికంగా ఫైబర్ ఉండడంతో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను మెరుగుపస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జామకాయను తీసుకోవడంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి.

మధుమేహ (షుగర్) వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా జామను చెప్పవచ్చు. మరోవైపు, జామపండులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో వైరస్ కారణంగా వ్యాపించిన జలుబు నివారణకు బాగా పనిచేస్తుంది. కానీ, జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంతమందికి జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడిచేసి, సైందవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకెటైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయ అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్- ఈ, ఒగరుతనం కలిగి ఉండడంతో చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సి-విటమిన్ అధికంగా ఉండడంతో తొందరగా చర్మకణాలు అతుక్కొని త్వరిత ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది.

వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఏ-విటమిన్ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కాల్షియం, ఐరన్ సపోట పండులో సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండు మంచి పౌష్టికాహరంగా పనిచేస్తుంది. విటమిన్ బీ1, బీ6, బీ12 అపారంగా ఈ పండులో ఉంటాయి. సపోటలోని గుజ్జు త్వరిత గతిన జీర్ణం కాకపోయినా పోషక విలువలు ఉన్న ఈ పండు తినడం ద్వారా ఉపయుక్తంగా ఉంటుంది. రోజూ దోర జామకాయ తింటే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చట. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి.

పండైనా, కాయైనా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక జామకాయలో సుమారు 5 గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తిన్న వ్యక్తుల్లో గుండెజబ్బు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. గుండె సమర్థవంతంగా పని చేసేలా జామపండు ఉపకరిస్తుంది. ఈ పండులో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. క్యాన్సర్ వ్యాధిని దరిచేరకుండా జామ పండు పనిచేస్తుంది.

అరటి:

పురాతన కాలం నుంచి అరటి పండ్లు మ‌న‌కు పోషకాలనిచ్చే ఆహారంగానే కాక వివిధ రకాల అనారోగ్యాలను నయం చేయడంలో ఔషధంగానూ పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని ఏ క్రీడాకారున్ని తీసుకున్నా వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎవరైనా కూడా రోజుకి 3 అరటిపండ్లను తినడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మ‌న‌ శరీరానికి నిత్యం కావల్సిన మోతాదులో పొటాషియం అందుతుందని పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే నిత్యం 3 అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే సమయాల్లో ఒక్కో అరటి పండును తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం 21 శాతం వరకు తగ్గుతుందని తెలిసింది. ఒక్కో అరటి పండులో దాదాపుగా 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉండడం వల్ల రోజూ వీటిని 3 వరకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అదేవిధంగా శరీరంలోని ద్రవాలను కావల్సిన స్థాయిలో ఉంచేందుకు, బీపీని తగ్గించేందుకు ఈ పండు అమోఘంగా పనిచేస్తుంది.

నిత్యం తినే ఆహారంలో ఉండే అత్యధిక లవణాల గాఢత కారణంగా ఎముకలు త్వరగా క్షయానికి గురవుతాయి. అయితే అరటి పండ్లను తింటే ఎముకలు దృఢంగా మారడంతోపాటు ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. మెదడు సరిగ్గా పనిచేయడంలో సెరటోనిన్ అనే మూలకం కీలకపాత్రను పోషిస్తుంది. తినే అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి దోహద పడుతుంది. దీని కారణంగా రోజూ తగినంత సంఖ్యలో అరటి పండ్లను తింటే మానసికంగా దృఢంగా ఉండవచ్చు.

ప్రధానంగా విద్యార్థులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల్లో అరటిపండును తీసుకుంటే తమ జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకోవచ్చు. రక్తహీనతను నివారించడంలో అరటిపండ్లు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తం, హిమోగ్లోబిన్‌ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పీచు పదార్థానికి నెల‌వుగా ఉన్న అరటిపండ్లు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఎటువంటి మందులు వాడకుండానే నిత్యం అరటిపండ్లను తింటే మలబద్దకం దానంతట అదే తగ్గిపోతుంది. అరటిపండ్లు, తేనెతో తయారు చేసిన స్మూత్ షేక్‌ను తీసుకుంటే హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. ఇది శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

రోజుకు ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. అయితే, ఒక అరటి పండులో కనీసం 14 గ్రాముల చక్కెర ఉంటుంది. అరటిపండును తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే, అదే పండ్ల వల్ల కొన్ని నష్టాలూ ఉన్నాయన్నది తెలుసుకోవాల్సిన విషయం.

అరటి పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తక్షణ శక్తి కావాలంటే అరటి పండును తింటే వెంటనే శక్తి లభిస్తుంది. అయితే ఇవే కాదు, ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు అరటి పండ్ల వల్ల కలుగుతాయి. అయితే అరటి పండు మాత్రమే కాదు, అరటి పండు తొక్క కూడా మనకు మేలు చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే.

అరటి పండు తొక్కను కూడా మనం తినవచ్చు తెలుసా! సైంటిస్టులు చేసిన ప్రయోగాలు అరటి పండు తొక్క తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు వరుసగా 3 రోజుల పాటు రోజుకు రెండు అరటి పండు తొక్కలను తినాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలను 15 శాతం వరకు పెంచుతాయి.

ఇలా సెరటోనిన్ పెరిగితే డిప్రెషన్ తగ్గుతుంది. మూడ్ బాగుంటుంది. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు అరటి పండు తొక్కలను రెగ్యులర్‌గా తింటే మంచి ఫలితం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ తైవాన్‌కు చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ట్రిప్టోఫాన్ అనే రసాయనం అరటి పండు తొక్కలో ఉంటుంది. అందువల్ల తొక్కను తింటే ఆ రసాయనం మన శరీరంలోకి చేరుతుంది. అప్పుడు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది.

హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధక బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు. దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. అరటి పండు తొక్కలో ఉండే ఫైబర్ అధిక బరువును ఇట్టే తగ్గిస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు క్రమంగా కరుగుతుంది. అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది.

దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అరటి పండు తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది.

రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, పుండ్లు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.