జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్‌టైమ్): ఆస్తిపన్ను చెల్లించని యజమానులందరికీ ప్రభుత్వం కల్పించిన ‘వన్ టైమ్ స్కీం’ (ఓటీఎస్) ప్రయోజనాలు అందించుటకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నది. అందుబాటులో వున్న ఆసిపన్ను బకాయిదారుల మొబైల్ నెంబర్లకు 90% వడ్డీ రాయితీ వెసులుబాటు గురించి సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది. వడ్డీ రాయితీ ప్రయోజనాలుపై అవగాహన కల్పించేందుకు ఎఫ్ఎం రేడియో జింగిల్స్, టెలివిజన్ చానల్స్‌లో స్క్రోలింగ్స్‌తో పాటు అన్ని సర్కిళ్లలోని 150 బస్ షెల్టర్లుపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో ప్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు అధికారులు. అలాగే మూడు భాషలలో కరపత్రాలు ముద్రించి ఆస్తిపన్ను బకాయిదారులకు పంపిణీ చేయనున్నారు. MyGHMC app లేదా website ద్వారా ఇంటినుండే ప్రాపర్టీ టాక్స్ బకాయిలు చెల్లింపులు జరిపేందుకు 90% వడ్డీ మాఫీ ప్రయోజనాలు పొందుటకు ఆన్‌లైన్ పెమెంట్ల ప్రక్రియను అప్‌గ్రేడ్ చేశారు.

జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలతో పాటు బిల్ కలెక్టర్లకు చెల్లింపులు చేయవచ్చు. వన్ టైమ్ స్కీం (ఓటీఎస్) అమలుపై జోనల్, డిప్యూటీ కమీషనర్లు, బిల్ కలెక్టర్లను కార్యోన్ముఖులను చేశారు. వన్ టైమ్ స్కీంతో నగర పరిధిలో 5 లక్షల 41 వేల 10 ప్రాపర్టీల యజమానులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనం పొందనున్న ప్రాపర్టీ దారుల వివరాలు జోన్ల వారీగా ఎల్బీ నగర్ (75, 305), చార్మినార్ (1,34,650), ఖైరతాబాద్ (1,08,617), శేరిలింగంపల్లి (40,790), కూకట్‌పల్లి (81,408), సికింద్రాబాద్ (1,00,240) ప్రాపర్టీ పన్ను చెల్లించని యజమానులకు వన్ టైమ్ స్కీం కింద 90% వడ్డీ మాఫీ వెసులుబాటును వర్తింపజేసేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

89 COMMENTS

  1. I’ll right away seize your rss as I can not in finding your e-mail subscription hyperlink or
    e-newsletter service. Do you have any? Kindly allow
    me know so that I may just subscribe. Thanks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here