విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): దేశ రాజధానిలో జరుగుతున్న ఫిక్కీ-ఈడీసీఐఎల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్‌లో ఏయూ పాల్గొంది. వర్సిటీ తరపున రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఈఎన్ ధనుంజయ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమిట్‌లో ఏర్పాటు చేసిన ఏయూ స్టాల్ జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను ఆకట్టుకుంది. ఈజిప్టులోని కైరో విశ్వవిద్యాలయం, బ్రిటీష్ అకాడమి,కెన్యాలోని ఇజిటాన్ వర్సిటీ, మడగాస్కర్‌లోని స్నీలా నేషనల్ సెంటర్ ద టీచింగ్ ఇంగ్లీష్, మడగాస్కర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎయిర్‌లంగా, ఇండోనేషియాలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, కాంబోడియాలోని ఇండియన్ ఎడ్యుకేషన్ స్కూల్,కువైట్ విద్యాసంస్థలు ఏయూతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపాయి. మడగాస్కర్, ఫిలిప్పైన్స్, మంగోలియా, ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రతినిధులు ఏయూ స్టాల్స్‌ను సందర్శించారు.