గోల్డెన్ హెరిటేజ్ మాస్కులు విత‌ర‌ణ‌

51

విజయనగరం, మార్చి 28 (న్యూస్‌టైమ్): క‌రోనా నియంత్ర‌ణ‌లో జిల్లా యంత్రాంగానికి వివిధ రూపాల్లో ప్ర‌జల‌నుంచి స‌హ‌కారం పెరుగుతోంది. గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజ‌య‌న‌గ‌రం (ఛారిట‌బుల్ ఫౌండేష‌న్‌) త‌మ వంతుగా 600 మాస్కుల‌ను అందించింది. వీటిలో 300 మాస్కుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌కు, మ‌రో 300 మాస్కుల‌ను జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారికి శ‌నివారం అంద‌జేశారు. క‌రోనా క‌ట్ట‌డికి త‌మంతుగా కృషి చేస్తున్న‌ పోలీసుల‌కు, పారిశుధ్య సిబ్బందికి మాస్కుల‌ను అంద‌జేయాల‌ని వీరు కోరారు. క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు కెఆర్‌కె రాజు, కిషోర్‌, మ‌ల్లిక్‌, చందు త‌దిత‌రులు పాల్గొన్నారు.