‘పైడి’ పలుకులు…

120
  • నీతి వాక్యాలు, మంచి మాటలు వినడానికి బాగుంటాయి. కాని ఎక్కువ మంది పాటించరు. అందుకే లోకంలో అధికంగా అవివేకులే కనిపిస్తారు.
  • కోటీశ్వరులు కావడం అందరికి సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.
  • సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
  • ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కి అయినా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి.
  • మనం మన అలోచనలకు బందీలం. అలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
  • గొడుగు వర్షాన్ని అపలేకపోవచ్చు.కానీ వర్షంలో తడిషిపోకుండా రక్షణ ఇస్తుంది.అలాగే అత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపధంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
  • బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్ధంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించనట్లే అనుకోవాలి.
  • అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం –ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
  • అహంకారం ప్రతి ఒక్కరినుంచీ- ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
  • ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
  • నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా, రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించకోలేవు.
  • మంచివారు దూరం కావడం, చెడ్డ వారు దగ్గర కావడమే దుంఖానికి నిదర్శనం.
  • బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
  • కాళ్లు తడవకపండా సముద్రాన్ని దాటగలవు. కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
  • పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంతసాయం, ఇదే జీవితం.
  • ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు, శిఖరం మీద కూర్చొన్నంతమాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
  • తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే భాధ తగ్గుతుంది. కానీ అకలి భాధనూ, అజ్ఞాన భాధనూ ఎవరకి వారే తగ్గించుకోవాలి.
  • మెరుగు పెట్టకుండా రత్నానికి,- కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
  • కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది.
  • ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే అ వ్యక్తికి గౌరవం ఉంటుంది.
  • ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే. వాటిని అధిగమిస్తే జయం మనవెంటే.
  • ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు, ఒకసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేం. అదికాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరకి వస్తువులైనా.
  • భయపడి చెవులు మూసుకుంటే, గెలుపు కొట్టే తలుపు చప్పడు ఎలా వినిపిస్తుంది.
  • జీవితం ఒక ఆట వంటింది.మనం ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి.(సంతరించుకోవాలి) ఇదే లోకం తీరు.
  • తెలివి గలవారు ఎప్పడూ కూడా ఇతరులు వైఫల్యం పొందినచోట నుంచి విజయాన్ని సాధించటం ప్రారంభిస్తారు.
    ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.