వార్తలు ఉచితం…

0
41 వీక్షకులు

చిన్న, మధ్యతరహా పత్రికలు, వెబ్ మీడియా ప్రచురణకర్తలకు ముఖ్యగమనిక…

మహమ్మారి కరోనా విపత్తు ప్రభావిత రంగాలలో మీడియా ఒకటి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రశ్నార్ధకంచేసి ప్రాణభయంతో అల్లాడించడంతో పాటు మునుపెన్నడూ లేనంత తీవ్ర నష్టాన్ని, ఆర్ధిక సంక్షోభాన్నీ కూడగట్టిన కొవిడ్-19 నేపథ్యంలో కేవలం న్యూస్, ఫొటోలు, వీడియోల సేకరణ, కంపోజింగ్, ఎడిటింగ్ తదితర కారణాల వల్ల తమ ప్రచురణ కార్యకలాపాలను తాత్కాలికంగా కొనసాగించుకోలేకపోతున్న వారికి కొంత వరకు సహాయపడాలన్న ఆశయంతో ‘న్యూస్‌టైమ్’ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న (Ready to Use) ఫార్మెట్‌లో కంటెంట్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా ప్రచురణకర్తలు తమకు అవసరమైన కంటెంట్‌ (రోజువారీ న్యూస్, ఫొటోలు, వీడియోలు) పూర్తి ఉచితంగా కాపీ/డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు వాటిని తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల యూనీకోడేతర (నాన్ యూనికోడ్) డైనమిక్ ఫాంట్ ఫార్మెట్‌లలోకి కన్వెర్ట్ చేసుకుని యథాతథంగా ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తోంది ‘న్యూస్‌టైమ్’.

ఉపయోగించుకోవడం ఎలా?

  • స్టెప్-1:

‘న్యూస్‌టైమ్’ అధికారిక వెబ్‌సైట్ https://newstime.in నుంచి కంటెంట్ (న్యూస్, ఫొటోలు, లోగోలు లేని వీడియోలు) పూర్తి ఉచితంగా పొందడానికి మొదట ఎవరైనా https://newstime.in ఓపెన్ చేసి allow బటన్ క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మా తాజా వార్తలు, ఫొటోలను ఎప్పటికప్పుడు మొదట మీరే పొందవచ్చు

  • స్టెప్-2:

తర్వాత సంబంధిత మెయిల్ ఐడీకి ప్రత్యేక లింక్ ద్వారా వచ్చే వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సహాయంతో ప్రింట్ మీడియా ప్రచురణకర్తలు తమ అవసరాలకు అనుగుణంగా యూనీకోడ్‌లోని ఐటమ్స్‌ను ఎడిట్ చేసుకోవడం, అనూ, శ్రీలిపి లేదా ఇతర డైనమిక్ (నాన్ యూనీకోడ్) ఫాంట్‌‌లలోకి కన్వెర్ట్ చేసుకుని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. అదే విధంగా కేబుల్ టీవీ, వెబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ వంటి వెబ్ మీడియా ప్రచురణకర్తలు తమ అవసరాలకు ఉపయోగపడేలా వీడియో, న్యూస్ కంటెంట్‌నూ ఉచితంగా పొందవచ్చు.

  • దీని వల్ల ప్రచురణకర్తలకు లాభం ఏమిటి?

చాలా మందికి ఈ డౌట్ ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇంత వరకూ అందరూ వేర్వేరు వెబ్‌సైట్ల నుంచి న్యూస్, ఫొటోలను కాపీ చేసుకుని కన్వెర్ట్ చేసి వాడుకుంటున్నారు కదా? కొత్తగా వచ్చే ఈ సదుపాయం వల్ల లాభం ఏమిటన్న ప్రశ్నకు ఏకైక సమాధానం కాపీరైట్ సమస్యను అధిగమించడం. చిన్న, మధ్యతరహా ప్రచురణకర్తల్లో నూటికి దాదాపు 98 శాతానికి పైగా అనధికారికంగా (ఎలాంటి అనుమతి లేకుండా) ఇతర వెబ్‌సైట్‌ల నుంచి కంటెంట్‌ను కాపీ చేసి అందుబాటులో ఉన్న కొన్ని ఫాంట్ కన్వెర్టెడ్ వెబ్‌సైట్‌ల ద్వారా నాన్ యూనీకోడ్ (అనూ, శ్రీలిపి తదితర) ఫాంట్‌లలోకి కన్వెర్ట్ చేసుకుని వాడుకుంటున్నారు. దీనివల్ల ఆయా ప్రచురణకర్తలు తమకు తెలియకుండానే కాపీరైట్ చట్రంలో ఇరుక్కొంటున్నారు.

ఇప్పుడు మానుంచి అధికారికంగా తీసుకునే కంటెంట్ వల్ల ఎలాంటి కాపీరైట్ సమస్యలూ తలెత్తే సమస్యే ఉండదు. అదే విధంగా దీని నిమిత్తం ఏ ప్రచురణకర్త కూడా ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. న్యూస్ కోసం శ్రమతప్పుతుంది కాబట్టి ప్రచురణకర్తలు తమ పత్రికల రూపకల్పనకు కొంత వరకు కష్టాలు తప్పనున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కమర్షియల్ ప్రింటింగ్ యూనిట్లు మూతపడినప్పటికీ కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా పత్రికల పీడీఎఫ్ ఫైళ్లను పాఠకులకు అందుబాటులో ఉంచే వెసులుబాటు కల్పించడం సాధ్యపడుతుంది.

సొంత వెబ్‌సైట్, వెబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కలిగిన వారు తాజా కంటెంట్‌తో నిరంతరం అప్‌డేటెడ్‌గా ఉండడం ద్వారా ఆన్‌లైన్ యాడ్ రెవెన్యూను పెంచుకోవచ్చు. కమర్షియల్ యాడ్ రెవెన్యూ తగ్గినా నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది కాబట్టి మీడియాపై ఆధారపడిన జర్నలిస్టులు ‘అప్ టు డేట్’గా ఉండవచ్చు.

కేవలం కరోనా కష్టకాలంలో చిన్న, మధ్యతరహా పత్రికల, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే వెబ్ మీడియా సంస్థల ప్రచురణకర్తలకు అండగా నిలవాలన్న ఆశయంతోనే తాత్కాలికంగా కల్పించిన ఈ అవకాశాన్ని ఔత్సాహిక ప్రచురణకర్తలంతా సద్వినియోగం చేసుకుంటారని సూచన.

Home


www.agency.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
https://www.youtube.com/channel/UCXqG9XdhmdGM2Aqui5USj6A
Mobile: 6300795484 & 9390556171

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here