‘పైడి’ పలుకులు…

0
6 వీక్షకులు
 • ఏ మనిషికైనా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యసాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించాలి.
 • జ్ఞానం లేకపోవడంకన్నా, శ్రద్ధలేకపోవడం ఎక్కువ ప్రమాదకరం.
 • మనిషి తన కలలును పండించుకోవాలంటే ముందు కళ్లు తెరవాలి.
 • పెద్దపెద్ద పనులకు ప్రణాళికలు తయారుచేస్తూ కూర్చోవడంకంటే చిన్నచిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం.
 • వివేకం గెలవలేనిచోట సహనం విజయాన్ని అందించవచ్చు.
 • సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే.
 • పశుబలమే శక్తికి చిహ్నం అయితే మగవాడే బలవంతుడు. అలాకాక బలమన్నది నైతికమూ మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తి స్వరూపులు.
 • జీవించే ప్రతి దశలో మనం ఎదుగుతూ పోవాలి. కొత్తపని చేయాలనుకున్నవారు సమస్యలు ఎదుర్కోవడం సహజం.
 • నవ్వుతూ ఉండటంవలన జీవితాన్ని బాగా అస్వాధించవచ్చు. కానీ, భాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోగలం.
 • ఇతరుల దోషాలను చూసినట్లు మన దోషాలను చూసుకోగల్గితే, ఈ ప్రపంచంలో చెడే ఉండదు.
 • దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు.
 • ఉన్నదానితో సంతృప్తి చెందడం గొప్ప విషయమే! అయితే నీ అర్హతకు తగింది సాధించే ప్రయత్నం మానకు.
 • అందరినీ మెప్పించలేం. కానీ, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం.
 • కోపం మనల్నే నష్టపరుస్తుంది. తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here