సర్కారు విధానాన్ని అర్ధం చేసుకోని అమాయకులు…

వ్యసనాన్ని మాసుకోక జగనన్న సాయం దుబారా…

అరాకొరా ‘చీప్’ బ్రాండ్‌ల అమ్మకాలతో వసూళ్లు…

ఇష్టారాజ్యంగా ఆబ్కారీ ట్రిక్కులు… అమ్మకాలు…

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అడుగడుగునా అక్రమాలు..

అమ్మకాలు జరపకపోయినా జీతాలు వస్తాయంటూ ధీమా..

బహుశా ఎలా వస్తాయో కూడా చెప్పే ఉంటారు అక్రమార్జర అధికారులు..

ప్రజాప్రతినిధుల బంధువుల పేరిట దుకాణాలలో సిబ్బంది హల్‌ చల్…

నిజాలు నిమ్మలేనివిగా, విమర్శలు తట్టుకోలేనివిగా ఉంటాయి. అందుకే చాలా మందికి అవంటే కోపం. కళ్లముందు తప్పుకనిపిస్తున్నా… ‘‘మనకు రావాల్సింది వస్తుంది కదా? దాని గురించి మనకెందుకులే’’ అనుకునే సమాజంలో ఉన్నామన్నది ప్రత్యేకించి గుర్తుచేయాల్సిన విషయం కాకపోయినా, వాస్తవానికి ఈరోజుల్లో తప్పును ఎత్తిచూపడం కన్నా పెద్దతప్పు మరొకటి లేదనిపిస్తుంది. వ్యవస్థలో చోటుచేసుకున్న చిన్న చిన్న లోపాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రబుద్ధులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతూ అందరినీ అబాసుపాల్జేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులే కాదు… దొడ్డిదారి సంపాదనకు అలవాటుపడిన ‘ఎర్న’లిస్టులూ (సారీ ఈ పదం నేను తప్పుగా మాత్రం రాయలేదు… నేను రాయాల్సింది జర్నలిస్టులన్నదే… కాకపోతే, ఆ కేటగిరీలో చాలామంది అత్యుత్తములు ఉన్నారు, వాళ్లతో ‘ఎర్నలిస్టులను’ పోల్చలేక తప్పలేదు.)

రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆబ్కారీ శాఖ అధికారులే ప్రధాన అడ్డంకిగా మారారన్నది ఇంత వరకూ కేవలం విమర్శే అనుకున్నా ఇటీవల వెలుగుచూస్తున్న పలు ఉదంతాలు మాత్రం అవి విమర్శలు కాదు, నిజాలేనని నిరూపిస్తున్నాయి. ప్రయివేటు వ్యాపారుల నుంచి మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వ అజమాయిషీలోకి వచ్చిన తర్వాత బెల్ట్ దుకాణాలు ఎక్కువయ్యాయంటే ఒప్పుకోని ఆబ్కారీ అధికారులు వందల సంఖ్యలో అక్రమ నిల్వలను ఎలా స్వాధీనం చేసుకుంటున్నారో చెప్పడానికి వెనకడుగువేయడం లేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మహమ్మారి నుంచి పేద కుటుంబాలను దూరం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే ఏపీ ఆబ్కారీ, మద్య నిషేధ మంత్రిత్వ శాఖ అధ్వర్యాన నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. గొలుగుకట్టు దుకాణాలకు దొడ్డిదారిన అడిగినంత మద్యాన్ని పంపిణీ చేస్తున్న సిబ్బంది సాధారణ కొనుగోలుదారుల విషయంలో తలలిక్క సమాధానాలతో వ్యాపారాన్ని పెంచుకోలేకపోతున్నారు రాష్ట్రంలోని చాలా దుకాణాలలో…

క్వార్టరుకు రూ.10 నుంచి 20 అదనంగా వసూలుతో గొలుసుకట్టు దుకాణాలకు కేసులకు కేసులు సరఫరా చేస్తూ ఆ మధ్య విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాక సర్కిల్‌ పరిధిలో ఓ బెల్టు షాపునకు సరకు సరఫరా చేస్తూ సిబ్బంది పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమునిపట్నం నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో ఒక షాపు నుంచి అక్రమంగా నిల్వచేసిన మద్యం సీసాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. లైనులో నిలుచున్న పట్టుమని పాతిక మందికి కూడా అమ్మడానికి లేవంటూ చెప్పే సిబ్బంది ఇవ్వకపోతే ఇంత భారీ మొత్తంలో ఓ బెల్ట్ దుకాణానికి అంతటి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘అమ్మకాలు జరపకపోయినా మా జీతాలు మాకు వస్తాయి’’ అంటూ కొన్ని దుకాణాల సిబ్బంది వ్యాఖ్యానించడం చూస్తుంటే దీళ్లకు ఆబ్కారీ అధికారుల సహకారం ఎంతుందో అర్ధమవుతోంది.

సుదీర్ఢ విరామం తర్వాత దుకాణాలు తెరచిన మొదట్లో మందుబాబుల రద్దీ ఎక్కువగా ఉండేది. క్రమంగా ఇప్పుడు నామమాత్రపు సంఖ్య కూడా ఆయా దుకాణాల (రూ. 150 ధర క్వార్టర్లు అమ్మినప్పుడు మినహా) ముందు కనిపించడం లేదు. ఇచ్చినమ్మా వాయనం అన్నరీతిలో అప్పటికి లైనులో ఉన్న పాతిక ముప్పై మందికి చీప్ క్వార్టర్లను అమ్ముతున్నట్లు బిల్డప్ ఇస్తున్న సిబ్బంది తర్వాత కేసులకు కేసుల్ని తమకు మామూళ్లు ఇచ్చే గొలుసుకట్టు దుకాణదారులకు లేదా సమీప రెస్టారెంట్ అండ్ బార్‌లకూ అప్పజెబుతున్నారు.

ఇవన్నీ ఆబ్కారీ అధికారుల మధ్య సమన్వయ లోపం ఆసరాగానే కొనసాగుతున్నాయన్నది ఎవరికి తెలియని నిజం? ప్రజాప్రతినిధుల బంధువుల పేరిట దుకాణాలలో మరికొందరు సిబ్బంది హల్‌ చల్ చేస్తున్నారు. గాజువాకలోని ఓ అరడజను దుకాణాలలో ఏకంగా అధికార పార్టీకి చెందిన కీలక నాయకుని అనుచరులే సిబ్బందిగా పనిచేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎక్సైజ్‌ అధికారుల సహాయ సహకారాలతో వైన్‌ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించేందుకు ప్రయివేటు వైన్‌ షాపులను రద్దుచేసి ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టిన విషయం తెలిసిందే. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా బెల్ట్‌ షాపులను నివారించేందుకు ఒక్కొక్కరికీ రెండు మూడు మద్యం సీసాల వరకు మాత్రమే విక్రయించాలని నిబంధన కూడా పెట్టింది. అలా నిబంధన పెట్టిన అధికారులు గొలుసుకట్టు దుకాణాల నుంచి వందలాది సీసాల మద్యాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటున్నారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి బెల్ట్‌ షాపులకు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే మద్యం సరఫరా కావడం గమనార్హం. ఇంకొన్ని మద్యం దుకాణాల్లో కొంతమంది సిబ్బంది మద్యంలో వాటర్‌, స్పిరిట్ కల్తీచేసి మరీ దొడ్డిదారిలో విక్రయిస్తున్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రైవేటు వైన్‌ షాపుల్లో పనిచేసిన సిబ్బందే చాలా చోట్ల ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేయడంతో మద్యం సీసాల్లో వాటర్‌ కల్తీకి పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

చీప్ లిక్కర్ అమ్మకాలకు దుకాణానికో సమయపాలనా?

దుకాణం తెరవడానికి ముందు నుంచే మందుబాబుల వెయిటింగ్…

రాష్ట్రంలో ఎక్కడుందో లేదో గానీ, వింతగా విశాఖ నగరంలోని కొన్ని దుకాణాల వద్ద మాత్రం చీప్ లిక్కర్ అమ్మకాలకు కూడా సమయపాలన నిర్ణయించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఆబ్కారీ శాఖ తీసుకున్న నిర్ణయమా? లేక స్థానిక పరిస్థితులకు, రద్దీ వాతావరణానికి అనుగుణంగా ఇక్కడి అధికారుల ఆదేశాలా? అన్నది తెలియదు కానీ, ఒక్కో దుకాణం వద్ద ఒక్కో సమయంలో చీప్ లిక్కర్ (రూ. 150 ధర కలిగిన బ్రాండ్లు) అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్కడైనా ఉన్న సరుకు అయిపోయినంత వరకూ అమ్మడం చూశాం గానీ, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల మధ్యే అమ్ముతామంటూ, అంతకముందు, ఆ తరువాతా వచ్చే కొనుగోలుదారులను కర్రలుపట్టుకుని మరీ తరిమికొట్టే పనిచేస్తుండడం విడ్డూరం. ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఉదయం 11 గంట నుంచి చీప్ లిక్కర్ అమ్మకాలు ప్రారంభించి కేవలం ఒక కేసు కూడా పూర్తి కాకముందే అయిపోయాయంటారు… అలాగే సాయంత్రం 6 గంటలకు మళ్లీ రెండో విడత చీప్ లిక్కర్ బ్రాండ్లను విక్రయిస్తారు… అది కూడా ముందు చెప్పినట్లే కేవలం పాతిక ముప్పై మందికి ఇచ్చి సరిపెడుతుంటారు.

ఈ మధ్య కొనుగోలుదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కొన్ని దుకాణాల వద్ద మాత్రం సమయంతో సంబంధం లేకుండా స్టాకు ఉన్న మేరకు విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని దుకాణాలలో మాత్రం తూ.తూ. మాత్రంగా ఓ కేసో, రెండు కేసులో అమ్మి, మిగిలిన సరుకును పక్కనపెట్టేసి ‘నోస్టాక్’ మాటలు వెల్లదీస్తున్నారు సిబ్బంది. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రస్తుతం చీప్ లిక్కరు బ్రాండ్లకే గిరాకీ కనిపిస్తోంది. రూ. 250, ఆపై ధరలల్లో బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నా స్థోమతలేక కొనుగోలుదారులు ఆయా బ్రాండ్ల జోలికి అంతగా వెళ్లేందుకు సాహసించడం లేదు.

బెల్టు దుకాణాలకు సరుకు ఎక్కడి నుంచి వస్తోంది?

అందరూ నీతులు చెప్పేవాళ్లే… గొలుసుకట్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించామని ప్రభుత్వ పెద్దలు ఏ లెక్కన ప్రకటిస్తున్నారో తెలియదు కానీ, వాస్తవంగా గతం కంటే ఎక్కువగా ‘బెల్టు’ అమ్మకాలు ఎక్కువయ్యాయి. అసలు వీళ్లందరికీ సరుకు ఎక్కడి నుంచి వస్తోంది. ఇది వరకంటే బార్ల నుంచి సరకు తెచ్చుకుంటున్నాురని తప్పించుకోవడానికి అదో మార్గంగా కనిపించేది. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు బార్లూ తెరుచుకున్నా… వాళ్లు కూడా బేవరేజస్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకుంటున్న సరకు కంటే ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్న సరుకే ఎక్కువ. అయితే, బెల్టు దుకాణాలకు ఇబ్బడిముబ్బడిగా, అది కూడా లైనులో ఉండి ఆశతో ఎదురుచూసేవారికి కూడా దొరుకుతుందో లేదో తెలియని రూ. 150 క్వార్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

అవి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి వస్తున్నవి కావా? లేక వాళ్లకు వాళ్లే తయారుచేస్తున్నవా? గత ప్రభుత్వ హయాంలో లెక్కకుమించినన్నిసార్లు ఆకస్మిక దాడులు చేసి బెల్టు దుకాణాల నిర్వాహకులపై కేసులు పెట్టి, సరుకును స్వాధీనం చేసుకున్నట్లు లెక్కల్లో చూపిన ఆబ్కారీ అధికారులు ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదు? దాడులు చేసి కేసులు పెడితే, పోయేది తమ పరువేనని గుర్తించారా? లేక అసలు బెల్టు షాపులే లేవని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా?

ప్రస్తుత ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో నడిచిన 43 వేల మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా నియంత్రించారు. ఇది నిజమో, అబద్దమో చెప్పాల్సింది ఆబ్కారీ అధికారులే. కారణాలు ఏమైనా ఈ మధ్య బెల్టు అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఉదాహరణకు 5000 జనభా ఉన్న ప్రాంతంలో ఇది వరకు నలుగురైదుగురు బెల్టు అమ్మకందారులు ఉంటే, ఇప్పుడు వారు ఏకంగా 7 నుంచి 10 మందికి చేరుకున్నారు. కూలికి వెళ్లడం కంటే, పది క్వార్టర్లు తెచ్చుకుని అదనపు మొత్తానికి అమ్ముకుంటే తమ రోజు గడిచిపోతుందనుకునేవాళ్లూ ఎక్కువయ్యారు. వీళ్లందరికీ సరుకు ఇస్తున్నది పక్క రాష్ట్రంలోని దుకాణాలు మాత్రం కాదు. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఒక సీసాకు రూ.10 నుంచి రూ. 20 వరకూ అదనంగా చెల్లిస్తే బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సివిల్‌ పోలీసులు బెల్ట్‌ షాపులపై దాడిచేసి పదుల సంఖ్యలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

వీరందరికీ ప్రభుత్వం మద్యం దుకాణాలు నుంచే మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. మద్యం షాపుల్లో మూడు సీసాలకు మించి ఇవ్వకూడదని నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు సరఫరా చేస్తున్నారు. పైపెచ్చు వివిధ రూపాలలో స్టాక్ పాయంట్ల నుంచి దుకాణాలకు వస్తున్న పాత స్టాక్ బ్రాండ్లను అధిక ధరలకు విక్రయిస్తుండడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయా దుకాణాలలో పనిచేసే సిబ్బంది అడ్డగోలు వ్యాపారానికి పరోక్షంగా కావచ్చు, పత్యక్షంగా కావచ్చు ఎక్సైజ్‌ అధికారులు సహకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్‌ స్టేషన్‌ నిర్వాహణ ఖర్చులకు గతంలో ప్రైవేటు వైన్‌ షాపు నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి ప్రతినెలా కొంతమొత్తం చెల్లించేవారు. నూతన మద్యం విధానం తర్వాత మద్యం ఎక్సైజ్‌ స్టేషన్‌ నిర్వాహణ ఖర్చులకు డబ్బులు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. బెల్ట్‌ షాపులపై దాడులు చేసేందుకు వాహనాలకు డీజిల్‌ కూడా ఉండడం లేదని కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు వాపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

దారుణం ఏమిటంటే రెస్టారెంట్ అండ్ బార్ నిర్వాహకులలో కొంత మంది ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలుచేసి అమ్ముకోవడం. ఏం వీళ్లకు ఆబ్కారీ డిపోలు సరకు ఇవ్వనంటున్నాయా? లేక అక్కడ కట్టేదేదో ఇక్కడి ప్రభుత్వ దుకాణాలలోని తమ అనుచరులుగా భావించే వారికి ఇచ్చేస్తే సరకు అందుబాటులో ఉంటుందనుకుంటున్నారా? తక్కువ ధర మద్యం బ్రాండ్‌లలో ఎక్కువ మంది అడిగే బ్రాంబ్‌లు రెండే రెండు.. అవి ఓఏబీ (ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ), గ్రీన్ ఛాయిస్. ఈ రెండూ రెస్టారెండ్‌ అండ్ బార్‌లలోకే ఇస్తారా? ఏం ప్రభుత్వ దుకాణాలలో అమ్మితే పేదలు ఆయా రెస్టారెండ్‌ అండ్ బార్‌లకు వెళ్లరని దిగులా? ఈ బ్రాంబ్‌లు ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఉంటున్నా ‘లైన్’లో ఉన్న కొనుగోలుదారులకు ఎందుకు అమ్మడం లేదో ఆ ఆబ్కారీ శాఖ అధికారులకే తెలియాలి. పైపెచ్చు అవే బ్రాండ్‌లు ఆ దుకాణానికి ఇరుగుపొరుగున ఉన్న రెస్టారెండ్‌ అండ్ బార్‌ల వద్ద అందుబాటులో ఉంటున్నాయి.

దొడ్డిదారి అమ్మకాలకు సహకరిస్తున్నది సిబ్బందేనా…

ఇందులో నిజమెంతో తెలియదు గానీ, చాలా దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే దొడ్డిదారి అమ్మకాలు ఎక్కువయ్యాయన్న ప్రచారం సాగుతోంది. అధికారుల పర్యవేక్ష లోపాన్ని ఆసరాగానే చేసుకుంటున్న కొంత మంది అక్రమార్కులైన సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. గ్రామీణ విశాఖ (రూరల్ విశాఖ) పరిధి గురించి చాలామందికి తెలిసిందే. ఇక, విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి వస్తే, గాజువాక, బీసీ రోడ్డు, రాజీవ్ రోడ్డు, భానోజీ కాలనీ, తోట, దయాల్ నగర్, పెదగంట్యాడ, హెచ్.బి. కాలనీ, జగ్గు సెంటర్, హై స్కూల్ రోడ్డు, దువ్వాడ స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాలలో నిరాటంకంగా ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉంటోందంటే దాని వెనుక ఆయా దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం దాగి ఉందన్నది అధికారులకు తెలియంది కాదు.

అయితే, చర్యల వరకూ వచ్చేసరికి ఎందుకో గానీ, వాళ్లు మొహం చాటేస్తున్నారు. ఇలా అలసత్వం వహిస్తే భవిష్యత్తులో తమ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని అధికారులు గుర్తిస్తే మంచింది. ప్రభుత్వ లక్ష్యం దిశగా అడుగులువేస్తుంటే అందుకు విరుద్దమైన దారిలో పయనిస్తున్న సిబ్బందిని నియంత్రించడంలో ఏ మాత్రం మిన్నకున్నా ప్రభుత్వ ఆశయం దెబ్బతిన్నట్లే. ఉన్నతాధికారులు స్పందించి మద్యం షాపుల్లో అక్రమాలను నివారించాలని, మద్యం దుకాణాల నుంచి బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలపై ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేసినా చేయకపోయినా, అమ్మినా అమ్మకపోయినా తమ జీతాలు తమకు వస్తాయన్న ధీమా వీళ్లలో ఎక్కువడానికి కారణం కూడా అధికారుల నియంత్రణ లోపమేనని తెలస్తోంది.

కొంతమంది దుకాణాల్లోని బ్రాండెడ్‌ సరుకుని విక్రయించేసినట్టు చూపించి దొంగచాటుగా తరలించి అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో పేర్లు తెలియని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. చెప్పుకోదగ్గ బ్రాండ్ల మద్యం మాత్రం అరకొరగానే సరఫరా చేస్తున్నారు. దీంతో బ్రాండెడ్‌ మద్యం కోసం భారీ డిమాండ్‌ ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని దుకాణంలోని సిబ్బంది తమ దుకాణానికి వచ్చిన కొద్దిపాటి బ్రాండెడ్‌ మద్యాన్ని అమ్మేసినట్టు చూపించి తమవద్ద దాచేసుకుంటున్నారు. దుకాణం మూసేసి ఇంటికి వెళ్లినపుడు తమతోపాటు ఆ సరుకుని పట్టుకుని వెళ్లి అధిక ధరలకు తమను సంప్రదించినవారికి అమ్ముకుంటున్నారు. ఇది సిబ్బందికి లాభసాటిగా ఉంటున్నప్పటికీ మందుబాబులకు మాత్రం ఇబ్బందిగా మారుతోంది. సులభంగా డబ్బులు సంపాదిస్తుండడంతో ఎక్కువమంది సిబ్బంది ఇదే బాట పడుతున్నారు. ఆ మధ్య గోపాలపట్నం సమీపంలోని ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది దుకాణం కట్టేసిన తర్వాత అందులోని సరుకుని దొంగచాటుగా తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, వారిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది కూడా ఇదే తరహాలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఈ పరిణామం మద్యం దుకాణాల మీద అధికారుల పర్యవేక్షణ ఏస్థాయిలో కొరవడిందనేదానికి అద్దంపడుతోంది.

ఉద్యోగాలు పోవన్న ధీమాతోనే విచ్చలవిడిగా…

ప్రభుత్వ లక్ష్యం వేరు, మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది ఆశయం వేరు అన్నట్లు వాస్తవ పరిస్థితులు తయారయ్యాయి. ‘‘అమ్మినా, అమ్మకపోయినా, పనిచేసినా, చేయకపోయినా మా జీతాలు మాకు వస్తాయి. ఎవరి కోసం రావు’’ అన్న ధోరణి దాదాపు ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే మెజారిటీ సిబ్బందిలో నాటుకుపోయింది. కొంత మంది బాధ్యతలు గుర్తెరిగి పనిచేస్తున్నా, కొంత మంది (వీళ్లలో సిఫార్సు లేఖలపై ఉద్యోగాలు సాధించిన వారు, ప్రజాప్రతినిధుల బంధుగణంగా ప్రాచుర్యంలో ఉన్నవారు) మాత్రం ఆబ్కారీ శాఖ అధికారుల మాటను కూడా ఖాతరు చేయని విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరికి ఆయా అధికారులను, వాడు, వీడు అన్న స్థాయికి కూడా వెళ్తున్నారు. ప్రజల కోసం ఇన్ని చేస్తున్న ప్రభుత్వం, అదే ప్రజల ధనం అడ్డగోలుగా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కరోనా విపత్తు సమయంలో కూడా మద్యం దుకాణాలను తెరిచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందన్న అపవాదును పక్కనపెడితే, ప్రభుత్వ లక్ష్యం పట్ల బాధ్యతలేని అక్రమార్కులను అడ్డుకునేందుకు, వారిపై నిఘా పెట్టేందుకు సీసీ కెమేరాలను ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఏర్పాటుచేసి, వీళ్ల పనితీరును పరిశీలిస్తే మంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మనిషి ఏది వద్దంటే అదే ఇష్టంగా చేస్తాడు, దేనిలో ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అటువైపే వెళ్తాడు, దేని వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అని చెబితే దాన్ని చేస్తాడు. బేసికల్గా మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువ. ఇది సైకలాజికల్ థియారీ. కాస్త మానసిక శాస్త్రం మీద పట్టు ఉన్న వారికి ఎవరికైనా దీని లోతు పాతులు తెలిస్తే… ఇలాంటి మానసికమైన ఆటనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆడుతోంది.. మద్యపాన నిషేధం విషయంలో జగన్ ప్రభుత్వం ఆడుతున్న ఆట ఇదే.

దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఇదే, మద్యం అమ్మకాల విషయంలో ఏపీ రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. ఓపక్క మద్యపాన నిషేధం అంటూ దశలవారీగా మద్యం దుకాణాలను ఎత్తివేస్తూ ఉన్నామంటూ చెబుతున్న ఏపీ సర్కారు అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గించడం లేదు. ఎంత రేట్లు పెరిగితే అంత మద్యం అమ్మకం అవుతోంది. మద్యం రేట్లు పెరిగే కొలది అమ్మకాలు తగ్గిన రేట్లు పెరిగిన దాన్ని చక్కగా ప్రభుత్వం కవర్ చేస్తోంది.

కవర్ చేయడం కాదు ఇంకా అమ్మకాల్లో ముందుకు దూసుకుపోతోంది. డిసెంబర్ నెలలో ఎన్నడూ లేనట్లుగా గత రికార్డులన్నీ తిరగరాసింది. ఏకంగా 2,300 ఓట్లు మద్యం అమ్మడం గతంలో ఎన్నడూ లేని రికార్డు. రోజుకు సుమారు 68 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గత ఏడాది మొత్తం మీద సుమారు 13 వేల కోట్ల రూపాయలను మద్యం ఆదాయం కింద ప్రభుత్వం ఖజానాలో వేసుకుంది. కొత్త సంవత్సరం ఎలా సుమారు 100 కోట్ల వ్యాపారం జరిగింది ఇది గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికం.

చివరి సంవత్సరం చేస్తే…

మద్యపాన నిషేధంపై దశలవారీగా ముందుకు వెళ్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు. దీనిలో భాగంగా సుమారు 33 శాతం షాపులను తొలగించారు. ప్రభుత్వమే మద్యం అమ్మేందుకే పూనుకుంది. ధరలు పెంచితే మద్యం తాగడం తగ్గిపోతుందని, కొత్త నిర్వచనాలు చెప్పి మద్యం ధరలు అమాంతం పెంచింది.. మరోపక్క స్థానిక రిస్కు అనుమతినిస్తూ ఎక్కడపడితే అక్కడ అనేక రకాల బ్రాండ్ల మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. విచిత్రమైన బ్రాండ్ సైతం ఆంధ్రప్రదేశ్‌లో దొరుకుతున్నాయి. వాటి ధర కూడా చాలా అధికంగా ఉంది. మరోపక్క మద్యం దుకాణాలకు అదనంగా మద్యం షాపింగ్ మాల్‌ను ప్రారంభించి అక్కడ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. మరో పక్క పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా నిఘా పెడుతూ ఖచ్చితంగా రాష్ట్రం మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి మధ్యనే ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ఆదాయం సరిపోక ఇప్పటికే పలు మార్గాల ద్వారా అప్పులు తీసుకొస్తున్నారు. అయినా, ఆదాయం ప్రభుత్వం నిర్వహణకు సరిపోవడం లేదు. మరి ఈ సమయంలో జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఎంతవరకు అమలవుతుంది అనేది సందేహమే. లేక ఎన్నికల వేళ హడావుడిగా మద్యపాన నిషేధం తీసుకువచ్చిన దాన్ని ఏ మేర జగన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరు అనేది పెద్ద ప్రశ్న.

మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, దీనిపై జగన్ సైతం అంతర్గత సమావేశాల్లో అధికారులకు కచ్చితంగా చెప్పే మాట. అయితే, ఇప్పుడు ఒకవైపు అప్పులు, మరోవైపు, రాష్ట్ర విభజన దృష్ట్యా ఆదాయం లేని రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఆదాయం సైతం ఆగిపోతే కనీసం ప్రభుత్వ నిర్వహణకు చాలా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని జగన్ గుర్తించారు. ఓపక్క మద్యపాన నిషేధం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉన్నామని, అందుకే మద్యం ధరలు భారీగా పెంచుతున్నామని చెబుతూనే మరోపక్క మద్యం ఆదాయం ఏ మాత్రం తగ్గకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసమే జగన్ సైకలాజికల్ గేమ్ సిద్ధం చేశారు.

ప్రతిపక్షాలకు దొరక్కుండా ఎటువైపు మద్యం నియంత్రణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మద్యం ఆదాయం మాత్రం గణనీయంగా రాష్ట్రంలో పెరగడం ఇప్పుడు సర్కార్కు కొత్త బలాన్నిస్తుంది. ఓ పక్క మద్యం ధరలు పెరిగి అమ్మకాలు తగ్గినా పెరిగిన మద్యం ధరలు మాత్రం ప్రభుత్వానికి మంచి చేస్తున్నాయి. మధ్య పాన నిషేధం విషయంలో జగన్ ‘కర్ర విరగకూడదు పాము చావాలి’ అన్న విధానాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

‘పెరుగుట విరుగుట కొరకే’ అన్న నానుడి బహుశా వీళ్లకు వర్తించదనుకున్నారేమో. ముఖ్యమంత్రి జగన్ ఆశయానికి తూట్లు పొడిచే పరిస్థితే వస్తే వీళ్లకు అక్రమార్కులైన అధికారులకు అరదండాలు ఖాయమనే విషయాన్ని మరచిపోతున్నట్లున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించరన్నది తెలుసుకుని పనిచేస్తే అది మద్యం దుకాణం కావచ్చు… రేషన్ షాపు కావచ్చు. ఎవరి జీవితమైనా నల్లేరుపై నడకే. చేయని విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరికి ఆయా అధికారులను, వాడు, వీడు అన్న స్థాయికి కూడా వెళ్తున్నారు. ప్రజల కోసం ఇన్ని చేస్తున్న ప్రభుత్వం, అదే ప్రజల ధనం అడ్డగోలుగా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కరోనా విపత్తు సమయంలో కూడా మద్యం దుకాణాలను తెరిచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందన్న అపవాదును పక్కనపెడితే, ప్రభుత్వ లక్ష్యం పట్ల బాధ్యతలేని అక్రమార్కులను అడ్డుకునేందుకు, వారిపై నిఘా పెట్టేందుకు సీసీ కెమేరాలను ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఏర్పాటుచేసి, వీళ్ల పనితీరును పరిశీలిస్తే మంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘పెరుగుట విరుగుట కొరకే’ అన్న నానుడి బహుశా వీళ్లకు వర్తించదనుకున్నారేమో. ముఖ్యమంత్రి జగన్ ఆశయానికి తూట్లు పొడిచే పరిస్థితే వస్తే వీళ్లకు అరదండాలు ఖాయమనే విషయాన్ని మరచిపోతున్నట్లున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించరన్నది తెలుసుకుని పనిచేస్తే అది మద్యం దుకాణం కావచ్చు… రేషన్ షాపు కావచ్చు. ఎవరి జీవితమైనా నల్లేరుపై నడకే.