ఘనంగా ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవం

105
మెక్కలు నాటుతున్న బ్యాంకు సీనియర్‌ మేనేజర్‌ ప్రకాశరావు

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీచ్‌ రోడ్డులోని గాయత్రి విద్యా పరిషత్‌ ఎంఎల్‌బీటీ ట్రస్ట్‌ స్కూల్‌లో ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ ఆంధ్రా బ్యాంక్‌ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచి సీనియర్‌ మేనేజర్‌ పి.బి.వి. ప్రకాశరావు పాఠశాల ఆవరణలో మెక్కలు నాటారు.

తెలుగు వారు గర్వించే విధంగా బోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాక్‌ను స్తాపించారన్నారు. నేడు బ్యాంక్‌ ప్రంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి సేవలను అందిస్తోందన్నారు. వినియోగదారులకు సత్వర, సమర్ధ సేవలను అందిస్తూ వారిని అన్ని విధాల సహకారం అందించడమే తమ బ్యాంక్‌ లక్ష్యంగా చెప్పారు.

కార్యక్రమంలో బ్యాంక్‌ అధికారులు కె.సతీష్‌, కె.పద్మావతి, ఆర్‌.రవిశంకర్‌ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.మధురవాణి, సిబ్బంది, ఏయూ పరిధిలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్యాంక్‌ అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు.