ఏయూ దూరవిద్య డైరెక్టర్‌గా హరిప్రకాష్‌

80

విశాఖపట్నం, జులై 1 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకులుగా ఆచార్య పి.హరిప్రకాష్‌ నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ఉదయం 9గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌లు హరిప్రకాష్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. దూరవిద్య కేంద్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు.