మీడియాకు హ్యాట్సాఫ్: అన్నాబత్తుని

0
15 వీక్షకులు
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌తో కలిసి జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్

తెనాలి జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ

గుంటూరు, మే 1 (న్యూస్‌టైమ్): కరోనా విపత్తు, లాక్‌డౌన్ కష్టాల నేపథ్యంలో వివిధ వర్గాలతో పాటు జర్నలిస్టులనూ ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ అప్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తెనాలి సమితి ఆధ్వర్యంలో అక్కడి జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం పంపిణీ చేశారు.

నిత్యం ప్రజల మధ్య ఉంటూ కరోనాపై అవగాహన కల్పిస్తున్న మీడియాకు హ్యాట్సాఫ్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవాలందిస్తున్నారని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు. యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి ఏచూరి శివ మాట్లాడుతు జిల్లాలో ప్రతి చోట జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నరాని, అయినా బాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. కరోనా విపత్తు, లాక్‌డౌన్ కష్టాల నేపథ్యంలో జర్నలిస్టులకి జిల్లాలో వివిధ రకాలుగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

జర్నలిస్టులకు, గ్లౌజ్‌లు, మాస్కులతో పాటు సుమారు 3000 రూపాయల విలువ చేసే 25 కేజీల సన్నబియ్యం, వంట నూనె, గొడుమపిండి తదితర నిత్యావసర సరుకుల కిట్‌ను అందజేశారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏపీయూడబ్ల్యూజే తెనాలి ప్రాంత నేతలు చందు సుబ్బారావు, చొప్పున సుధాకర్, ఎల్. వెంకటేశ్వరరావు, వీరవల్లి మురళి, కృష్ణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు పాత్రికేయులకు ఆదాల రూ. 2 లక్షల విరాళం

పాత్రికేయులకు పంపిణీ నిమిత్తం మాస్కులు, శానిటైజర్, నగదు అందజేస్తున్న కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గంలో భాగమైన ప్రకాశం జిల్లా కందుకూరులో పాత్రికేయులకు రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి రెండు లక్షల రూపాయల నగదు మొత్తాన్ని అందజేశారు. కందుకూరులో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందజేసిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని వారికి నిత్యావసర సరుకుల ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీకి తన ధన్యవాదాలు తెలిపారు. విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి మాట్లాడుతూ ఈ లాక్‌డౌన్ సమయంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే కందుకూరు పాత్రికేయ మిత్రుల సంక్షేమానికి రెండు లక్షల రూపాయల మొత్తాన్ని అందజేశారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు గుడ్లూరు ప్రాంతాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాక్‌డౌన్ సహాయక చర్యల నిమిత్తం ఇటీవల తన సొంత నిధులు 20 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here