నిరసనలో పాల్గొన్న కార్మికులకు పండ్లు పంపిణీ చేస్తున్న తీగాపూర్‌కు చెందిన జంగయ్య

విజయనగరం కార్మికులతో పనుల కొనసాగింపు?

31వ రోజు నల్ల ముసుగలతో నిరసన తెలిపిన కార్మికులు

హైదరాబాద్, ఆగస్టు 19 (న్యూస్‌టైమ్): అక్రమంగా మూడు నెలల క్రితం కార్మికులను తొలగించి 45 కుటుంబాలను రోడ్డుపాలు చేసిన యాజమాన్యం నేటికీ మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. కార్మికులు 31 రోజులుగా కంపెనీ ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తమ నిరసనకు కొనసాగింపుగా ఈ రోజు నల్ల మూసుగులతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పరిశ్రమ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తూ మరోపక్క విజయనగరం నుండి ఈరోజు కార్మికులను తీసుకువచ్చారని, ఇద్దెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ముందు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తీగాపూర్‌కి చెందిన జంగయ్య కార్మికులకు పండ్లు పంచిపెట్టారు.