చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు

218

న్యూయార్క్, జనవరి 28 (న్యూస్‌టైమ్): నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్… అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, యు.ఎస్. నావికదళ చోదకుడు (అవియేటర్). ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌకలో తోటి పైలట్ డేవిడ్ స్కాట్‌తో ప్రయాణించాడు.

ఆర్‌మ్‌స్ట్రాంగ్ రెండవ, ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20 1969న అమలుపరచబడినది. ఈ మిషన్ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్, బజ్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు.

ఆర్‌మ్‌స్ట్రాంగ్‌కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడినది. అపోలో 11 నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమిని 8 వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం వున్నది.

ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యం, భయావహనం మొదలగువాటిని అనుభవించాడు.