ఏయూకు హెల్త్ కార్డుల పట్ల హర్షం

62

విశాఖపట్నం, మే 22 (న్యూస్‌టైమ్): విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏయూ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలసి ఏయూ జేఏసీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అధ్యక్షుడు జి.రవికుమార్, విశ్రాంత ఆచార్యుల సంఘం అధ్యక్షుడు ఆచార్య తిమ్మారెడ్డి, విశ్రాంత బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.