న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): పారిశ్రామిక వృధా జలాలను సాధ్యమైనంతగా తగ్గించడం ద్వారా కొద్ది నెలల వ్యవధిలోనే గంగ నీటిలో ఉన్న భారీ ధాతు కాలుష్యాన్ని తగ్గించవచ్చని కోవిడ్-19 మహమ్మారి సమయంలో చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో లాక్డౌన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందానికి భారీ నదులలో రసాయన స్థితిస్థాపకతపై మానవవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిణామాన్ని అంచనా వేసే అవకాశం లభించింది. దేశంలో 51రోజుల పాటు విధించిన తప్పనిసరి లాక్ డౌన్ కారణంగా పారిశ్రామిక వృధాల విడుదల తగ్గడంతో కనీసం 50%నికి భారీధాతు సాంద్రత తగ్గిందని, గంగ నీటి రోజువారీ భూరసాయన రికార్డులను పరిశీలించి, వారు విశ్లేషించారు. ఇందుకు భిన్నంగా, వ్యవసాయ బహిస్సరణం, నైట్రైట్, ఫాస్ఫేట్లతో కూడిన గృహాల నుంచి విడుదలయ్యే మురుగు మాత్రం దేశవ్యాప్త నిర్బంధం కారణంగా ఎటువంటి ప్రభావానికీ లోనుకాకుండా యధాతథంగా ఉన్నాయని చెప్పారు.
ఈ పరిశోధనకు భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ కింద ఏర్పడిన ద్వైపాక్షిక సంస్థ ఇండో-యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం (ఐయుఎస్ ఎస్టిఎఫ్) తోడ్పాటునిచ్చాయి. ఇటీవలే ముద్రించిన ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్లో ప్రచురితమైన ఈ పరిశోధన కరిగిన భారీ ధాతువుల అధిక స్థితిస్థాపకతను పట్టి చూపాయి. ప్రపంచంలోని భారీ నదులపై పరిశోధనకు జత చేరిన ఈ అధ్యయనాన్ని, నదీ జలాల గుణాత్మకత, పరిణామంపై పర్యావరణ మార్పు, ప్రత్యక్ష మానవ చొరవల ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు తీవ్రంగా అధ్యయనం చేశారు. అందుకే దీనికి జర్నల్ కవర్‌పేజీపై స్థానం దక్కింది.